నిడమనూరు, నవంబర్ 21 : రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేసి మద్దతు ధర అందించడమే ప్రభుత్వ లక్ష్యమని నిడమనూరు మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండలంలోని నారమ్మగూడెంలో గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్నరకం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. ధాన్యం విక్రయాల్లో నిబంధనలు పాటించాలని కోరారు. కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం నరహరి, సీసీ సైదులు, మాజీ సర్పంచ్ కొండా కృష్ణవేణి, మాజీ వైస్ ఎంపీపీ బైరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా శ్రీనివాస్ రెడ్డి ముంగి శివమారయ్య, గడ్డం గోవింద రెడ్డి ,దుబ్బాకుల రాంరెడ్డి ,బైరెడ్డి సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు.