చివ్వేంల, నవంబర్ 18 : విద్యార్థులు మత్తు పదార్ధాలు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి దేశాన్ని ప్రగతి పథంలో నడిపించాలని ట్రైనీ ఆర్డీఓ రవితేజ అన్నారు. మంగళవారం చివ్వేంల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. పాఠశాలలో నిషా ముక్త్ భారత్ దివస్ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కళారాణీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, అక్రమ రవాణాను నిరోధించాల్సిన బాధ్యత తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్ధాలను ప్రజలకు తెలియచేసి ఆరోగ్య భారత్ కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చివ్వేంల ఎంపీడీఓ సంతోష్ కుమార్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భవాని, డిప్యూటీ తాసీల్దార్ జ్యోతిర్మయి, ఆర్ఐ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి విక్రమ్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.