తుంగతుర్తి, ఏప్రిల్ 04 : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని తుంగతుర్తి మండలం రావులపల్లి సర్పంచ్ చింతకుంట్ల మనోజ్ అన్నారు. శనివారం గ్రామంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ప్రతిభ కలిగిన, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉంటారన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, యూనిఫాం ప్రభుత్వం అందిస్తోందని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు చిలుక శ్రీనివాస్, పీఈటీ వడ్లకొండ శ్రీను పాల్గొన్నారు.