మునుగోడు, జూన్ 04 : రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని మునుగోడు మండల వ్యవసాయ అధికారి ఎస్.పద్మజ అన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలోని రైతువేదిక నందు విత్తన డీలర్లుకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డీలర్లందరూ విత్తనాలు అమ్మిన రైతులకి రశీదు తప్పకుండా ఇవ్వాలన్నారు. నాణ్యమైన విత్తనాలను మాత్రమే అమ్మాలని సూచించారు. అధిక ధరలకు విత్తనాలను అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం మండలంలోని పలివెల, ఊకొండి గ్రామాల్లో ఎరువుల, విత్తనాల దుకాణాల్లో తనిఖీలు చేశారు.
రేటు తక్కువగా ఉందని ఊరిలోకి వచ్చి అమ్మేవారిని నమ్మి మోసపోవద్దు అని రైతులకు సూచించారు. ఎవరైనా అలా అమ్మినట్టు తెలిస్తే వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. సేంద్రీయ ఎరువులు, బయోస్ అని చెప్పి తక్కువ రేటుకు అమ్ముతారు. కానీ అవి నాణ్యమైనవి కావన్నారు. కావున రైతులు ఎరువులు విత్తనాలు పురుగు మందులు కొనుగోలు చేసే ముందు జాగ్రత్తగా ఉండాలని, ఎటువంటి సందేహం ఉన్న వ్యవసాయ అధికారి దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు.