సర్వ మతాల సారాంశం మానవత్వమే
మతమేదైనా సర్వ మతాల సారాంశం మానవత్వమేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని పీఎస్ఆర్ సెంటర్లోని చిన్న మసీదులో ముస్లింలకు గురువారం రాత్రి ఇఫ్తార్ విందు ఇచ్చారు.
- కుల, మతాల ఐక్యతతో ముందుకు సాగుదాం
- విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
- ఘనంగా ముస్లింలకు ఇఫ్తార్ విందు
సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 13 : మతమేదైనా సర్వ మతాల సారాంశం మానవత్వమేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని పీఎస్ఆర్ సెంటర్లోని చిన్న మసీదులో ముస్లింలకు గురువారం రాత్రి ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మసీదులు, దర్గాలు, కబ్రస్థాన్ల అభివృద్ధికి అనేక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ మసీద్ వద్ద కమ్యూనిటీ హాల్ కావాలని కోరారని తప్పకుండా త్వరలో దానికి శంకుస్థాపన చేసుకుని మూడు నాలుగు నెలల్లోనే నిర్మాణం పూర్తి చేసుకుందామన్నారు. సూర్యాపేట పట్టణంలో ఒక మంచి వాతావరణం ఉందన్నారు.
మతమేదైనా ఇక్కడ అందరూ అన్నదమ్ముల్లా ఉంటారని తెలిపారు. ఇటీవల కాలంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో ఘర్షణలు లేపి అభివృద్ధి అడ్డుకోవాలని చూస్తున్నదని విమర్శించారు. వారు అభివృద్ధి చేయలేక మన అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఇలాంటి కుట్రలకు మనం తావివ్వవద్దని సూచించారు. అనంతరం ముస్లింలకు రంజాన్ తోఫా అందించారు. కార్యక్రమంలో ఆర్డీఓ రాజేంద్రకుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయనగౌడ్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రియాజుద్దీన్, షాహిద్ మౌలానా, ఉర్దూఘర్ చైర్మన్ కరాటే సయ్యద్, బీఆర్ఎస్ పట్టణ ఉపాధ్యక్షుడు చాంద్‌పాష, ఎస్కే. రఫీ, అజీజ్, నజీర్, జావిద్, మస్తాన్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NIMS Hospital | నిమ్స్‌లో ఓపీ సమయం పెంపు.. మధ్యాహ్నం 2.00 గంటల వరకు రిజిస్ట్రేషన్లు
Rashmika Mandanna | సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రష్మిక మందన్న.. 400 కుటుంబాలకు చేయూత
Kaleshwaram Project | రిపేరెందుకు చేయలే.. మేడిగడ్డ బరాజ్‌పై కేంద్ర సాంకేతిక కమిటీ సూటి ప్రశ్నలు.. నీళ్లు నమిలిన రేవంత్ సర్కార్
RS Praveen Kumar | రేవంత్ ప్రొటెక్షన్ ఫోర్స్‌గా ఆర్పీఎఫ్..! ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆగ్రహం
Mrunal Thakur | కథలు నచ్చక..కాస్త విరామం..! మృణాల్ ఠాకూర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

