మంత్రి కేటీఆర్ చొరవతోనే నల్లగొండకు ఐటీ హబ్
‘దేశంలో ఐటీ మంత్రి అంటే ప్రపంచ వ్యాప్తంగా కేటీఆర్ పేరే సుపరిచితం. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అంటే నాతోపాటు ఎవరికీ పెద్దగా తెల్వదు. అంత గొప్ప తెలివి తేటలున్న కేటీఆర్ ఐటీ హబ్‌ను అమెరికా నుంచి నల్లగొండకు తీసుకొచ్చిన మహా మేధావి’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.
- దేశంలో ఐటీ మంత్రి ఎవరంటే కేటీఆర్ పేరే చెప్తరు..
- కాంగ్రెస్ వృద్ధ సింహాలను ఎవరూ ఆహ్వానించే పరిస్థితి లేదు
- రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
నల్లగొండ, అక్టోబర్ 2 : ‘దేశంలో ఐటీ మంత్రి అంటే ప్రపంచ వ్యాప్తంగా కేటీఆర్ పేరే సుపరిచితం. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అంటే నాతోపాటు ఎవరికీ పెద్దగా తెల్వదు. అంత గొప్ప తెలివి తేటలున్న కేటీఆర్ ఐటీ హబ్‌ను అమెరికా నుంచి నల్లగొండకు తీసుకొచ్చిన మహా మేధావి’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో ఐటీ, ఇతర పరిశ్రమలు ముందు వరుసలో ఉండటానికి కారణం మంత్రి కేటీఆర్ చతరుతే అని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో నల్లగొండలో ఫ్లోరోసిస్‌ను పెంచి పోషించిన వృద్ధ సింహాలు మళ్లీ వస్తున్నారని, వాళ్లను ప్రజలు ఇంకా నమ్ముతున్నట్లు భ్రమ పడుతున్నారని ఎద్దేవా చేశారు. నల్లగొండలో ఫ్లోరోసిస్‌ను అంతమొందించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కాదని మిమ్మలను ప్రజలు ఆహ్వానిస్తున్నారా? అని ప్రశ్నించారు.
నల్లగొండలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి కంటే గొప్పగా అభివృద్ధి చేశారని పిలుస్తున్నారా.. లేదంటే మరోసారి కరువు తీసుకొస్తారని పిలుస్తున్నారా? అని కోమటిరెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర్‌రెడ్డిలను ఉద్దేశించి ప్రశ్నించారు. 40 ఏండ్లలో మీరు చేసిన అభివృద్ధి, తొమ్మిదేండ్లలో తాము చేసినందుకు ప్రజలు ఆహ్వానిస్తున్నారా అన్నారు. నిజాం కాలం నాటి నల్లగొండ రోడ్లను సీఎం కేసీఆర్ సహకారంతో భూపాల్‌రెడ్డి వందల కోట్లు పెట్టి ఆధునీకరిస్తే ఆయనను కాదని ప్రజలు ఎలా ఆదరిస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు చెప్పే అబద్ధాలు ప్రజలకు తెలుసని, వారిని మరోసారి నల్లగొండ ప్రజలు నమ్మబోరని, ఉమ్మడి జిల్లాలో 12కు పన్నెండు మందిని మరోసారి దీవించి అసెంబ్లీకి పంపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఏబీసీడీలు రాని, కంప్యూటర్ ఎటు నుంచి చూడాలో తెలియని కోమటిరెడ్డికి ఐటీ మంత్రి ఇస్తే ఐటీ హబ్ తీసుకురాలేక పోయారని ఎద్దేవా చేశారు. మెడికల్ కళాశాల తెస్తామని చెప్పి తేలేకపోతే కంచర్ల భూపాల్‌రెడ్డి ఒకే ఏడాదిలో తీసుకొచ్చారని తెలిపారు. ఈ అభివృద్ధి పూర్తి కావాలంటే మరోసారి భూపాల్‌రెడ్డికి అవకాశం ఇవ్వాలని కోరారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

