చందంపేట (దేవరకొండ), సెప్టెంబర్ 11 : దేవరకొండ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. మార్నింగ్ వాక్ (జన హిత ) కార్యక్రమంలో భాగంగా గురువారం దేవరకొండ పట్టణంలోని వివిధ వార్డులో పలు శాఖల అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా రూ.కోటి నిధులతో ఎస్ఐసీ ఆఫీస్ నుండి కోర్టు వరకు సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన, అలాగే రూ.2 కోట్లతో కోర్టు నుండి పేట చెరువు వరకు సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన, అదేవిధంగా రూ.2 కోట్లతో తుల్చమ్మ కుంట సుందరీకరణతో పాటు వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం పట్టణంలో ఉన్న బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ హాస్టల్స్ లో నిర్లక్ష్యం వహించకుండా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు. మెనూ ప్రకారం భోజనం అందించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ సుదర్శన్ రెడ్డి, మాజీ మాజీ చైర్మన్లు ఆలంపల్లి నరసింహ, దేవేందర్ నాయక్, పున్న వెంకటేశ్వర్లు, వెంకటేశ్ గౌడ్, సురేశ్ గౌడ్, యూనిస్, కొర్ర రామ్ సింగర్, హరికృష్ణ, కరుణాకర్, బికూ నాయక్, శ్రీనివాస్, సైదులు పాల్గొన్నారు.