Tammineni Veerabhadram | మిర్యాలగూడ, మార్చి 5 : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు ప్రారంభించింది. నిపుణుల చేత పరీక్షించకుండా పనులు ప్రారంభించడం వల్లనే ఈ ప్రమాదం సంభవించిందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు.
ఇవాళ మిర్యాలగూడ సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. టన్నెల్ పనులు ప్రారంభించేటప్పుడు నిపుణులు అయినటువంటి ఇంజనీర్ల చేత టన్నెల్‌ను పూర్తిగా పరిశీలించి పనులు ప్రారంభించాల్సి ఉందని.. కానీ ఇవేవీ పట్టించుకోకుండా పనులు ప్రారంభించడం వలన ఈ రోజు ఎనిమిది మంది ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ బలం పుంజుకోవడం వలన తెలంగాణ రాష్ట్రంలో మున్ముందు మత ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉన్నదని తెలిపారు.
ఇకనైనా ప్రధాన పార్టీలు కళ్ళు తెరవకుంటే తెలంగాణ రాష్ట్రంలో పెను ప్రమాదం తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర నాయకులు జూలకంటి రంగారెడ్డి , పోతినేని సుదర్శన్ , నాగేశ్వర్ , తుమ్మల వీరారెడ్డి , సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.
Singer Kalpana | వెంటిలేటర్‌పై చికిత్స.. కల్పన హెల్త్ బులెటిన్ విడుదల
Crazy Star Award | రెబ్బెనకు చెందిన దేవర వినోద్‌కు క్రేజీ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
Inter student | పోలీసుల ఔదార్యం.. ఇంటర్ విద్యార్థిని సకాలంలో పరీక్ష కేంద్రానికి తరలింపు