కట్టంగూర్, ఏప్రిల్ 15 : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తి స్థాయిలో అమలు చేసి అర్హులైన వారికి పింఛన్లు, ఇండ్ల స్థలాలు, రైతు భరోసా, రుణమాఫీ చేయాలని సీపీఎం పార్టీ నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. సమస్యల పరిష్కరం కోసం పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పోరుబాట పాదయాత్ర మంగళవారం ముగిసిన అనంతరం తాసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నేటికి అమలుకు నోచుకోవడం లేదన్నారు.
అయిటిపాముల లిస్ట్ పనులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలన్నారు. భూ సమస్యలు పరిష్కరించి పేదలకు న్యాయం చేసి కబ్జాలో ఉన్న వాళ్లకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం పెండింగ్ లో ఉన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించాలని తాసీల్దార్ గుగులోతు ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి పెంజర్ల సైదులు, వంటిపాక వెంకటేశ్వర్లు, కుమ్మల శంకర్, ఇటికాల సురేందర్, కట్ట బక్కయ్య, గుడుగుండ్ల రామకృష్ణ, చిలుముల రామస్వామి, మురారి మోహన్, గడగోజు రవీంద్రాచారి, జాల రమేశ్, ఉట్కూరి సుజాత, శ్రీను., జాల అంజనేయులు, చిలుకూల సైదులు, లక్ష్మయ్య, ముసుకు రవీందర్ పాల్గొన్నారు.