– గానుగబండ సర్పంచ్ మాతంగి వెంకటమ్మ
తుంగతుర్తి, జూలై 13 : గ్రామ ప్రజల దహాదిని తీర్చడానికి వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని తుంగతుర్తి మండలం గానుగబండ గ్రామ సర్పంచ్ మాతంగి వెంకటమ్మ కరుణాకర్ అన్నారు. సోమవారం గ్రామంలో ఎన్నారై నల్లు చిత్తరంజన్ రెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామ ప్రజలందరూ శుద్ధి జలాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లావణ్య, మాజీ సర్పంచ్ నల్లు రామచంద్రారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకులు రాములు గౌడ్, గుండగాని దుర్గయ్య, వీరయ్య, కుశలవ రెడ్డి, వార్డ్ మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.