Beer Bottles | అది నిత్యం వేలాది మంది వైద్యం కోసం తరలివచ్చే ప్రభుత్వ ఆస్పత్రి. ప్రతీ రోజు పరిశుభ్రంగా ఉండాల్సిన ఆస్పత్రి మందుబాబులకు అడ్డాగా మారిపోయిందా..? అని తాజాగా బయటకు వచ్చిన వీడియో పలు అనుమానాలకు తావిస్తోంది. ఇంతకీ ఈ వీడియో ఎక్కడ తీసిందనుకుంటున్నారా..? హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రిలో బీర్ బాటిళ్లు దర్శనమిచ్చాయి.
ఆస్పత్రిలో రోగులను చూసే గదుల పక్కన బీర్ బాటిళ్ల కాటన్ కనిపించిన వీడియో సోషల్ మీడియాలోచక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆస్పత్రిలోకి ఈ బీర్ బాటిళ్లు ఎలా వచ్చాయి.. ? మందుబాబులు ఏమైనా సిట్టింగ్ వేశారా..? అనేది తెలియాల్సి ఉంది. ఉస్మానియా ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఎలా ఉందో చెప్పకనే చెబుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
హైదరాబాద్ – ఉస్మానియా ఆసుపత్రిలో బీరు బాటిళ్ల కలకలం pic.twitter.com/1D4G8FXWNS
— Telugu Scribe (@TeluguScribe) July 30, 2026
Municipal Commissioner | భద్రకాళి బండ్పై పెండింగ్ పనులను పూర్తి చేయాలి : బల్దియా కమిషనర్
Punjab Paper Leaks | పంజాబ్లో వరుస పేపర్ లీకేజీలు.. ఆప్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆందోళన
Yellampalli Project | ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కొనసాగుతున్న గోదావరి జలాల ఎత్తిపోతలు