వరి వద్దు ఇతర పంటలు మేలు !
ప్రస్తుతం సాగర్ ప్రాజెక్టులో నీళ్లు లేని కారణంగా యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవడమే మేలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
- నేల స్వభావాన్ని బట్టి పంటలు సాగు చేయాలి
- పంట మార్పిడితో చీడపీడలను అరికట్టవచ్చు
- గడ్డిపల్లి కేవీకే మృత్తికా శాస్త్రవేత్త దొంగరి నరేశ్
గరిడేపల్లి, డిసెంబర్ 6 : ప్రస్తుతం సాగర్ ప్రాజెక్టులో నీళ్లు లేని కారణంగా యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవడమే మేలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. రైతులు తమకున్న కొద్ది మేర నీటి వనరులను ఉపయోగించుకుంటూ నేల రకాన్ని బట్టి ఆరుతడి పంటలను సాగు చేస్తే మంచి ఫలితాలను సాధించవచ్చని తెలుపుతున్నారు. అయితే.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎర్రనేలలు, నల్లరేగడి, ఇసుక, రాతి నేలలు ఉన్నాయి.
రైతులు తమ భూమిలో ఆరు తడి పంటల్లో ఏదో ఒకటి అన్నట్టు కాకుండా నేలల రకానికి అనుగుణంగా పంటలను సాగు చేయాలి. వాటిలో సరైన యాజమాన్య పద్ధతులను పాటిస్తే మంచి దిగుబడులు పొందవచ్చని గడ్డిపల్లి కేవీకే ఇన్చార్జి ప్రోగ్రాం కో ఆర్డినేటర్ దొంగరి నరేశ్ సూచిస్తున్నారు. పంటల సాగులో నేల రకమే కీలకమని, దానికి అనుగుణంగా పంటలను ఎంచుకుని సాగు చేయాలని తెలిపారు. ఏ నేలలో ఏ రకాలను సాగు చేయాలనే విషయాలను ఆయన వివరించారు. అదనపు సమాచారం కోసం 9290615952 నెంబర్‌ను సంప్రదించవచ్చు.
వేరుశనగ : యాసంగిలో జనవరి చివరి వరకు వేసుకోవచ్చు. గరప, నీరు త్వరగా ఇంకే ఎర్ర చెల్క నేలలు అనువైనవి. 100 – 120 రోజుల్లో పంట కోతకు వస్తుంది. అనువైన విత్తన రకాలు : కదిరి 6, 7, 8, 9, కదిరి హరితాంధ్ర, ఐసీజీవీ – 91114, ధరణి, కదిరి లేపాక్షి (కే-1812)
చెరుకు : డిసెంబర్ నుంచి మార్చి వరకు నాటుకోవచ్చు. చౌడు భూముల్లో నాటుకునే వంగడాలు అందుబాటులోకి వచ్చాయి. నీటి సదుపాయం కలిగిన నల్లరేగడి, ఒండ్రు, మెరక భూములు అనువైనవి.
అనువైన విత్తన రకాలు : కో- 6907, కో-8014, కో-94008, కో-419, కో-811, కో, ఆర్ – 8001
నువ్వులు : మురుగు నీరు నిల్వని తేలికైన నేలలు శ్రేష్టం. నీరు నిలిచే ఆమ్ల, క్షార గుణాలు గల నేలలు పనికిరావు.
విత్తే సమయం : జనవరి రెండో పక్షం నుంచి ఫిబ్రవరి మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు. 85- 90 రోజుల్లో పంట కోతకు వస్తుంది.
విత్తన రకాలు : శ్వేత, రాజేశ్వరి, చందన, గౌరీ.
పొద్దుతిరుగుడు : నీరు నిల్వ ఉండని ఎర్ర చెల్క, ఇసుక, రేగడి, ఒండ్రు నేలలు శ్రేష్టమైనవి. అంతర పంటగా 4 ః 2 నిష్పత్తిలో వేరుశనగ + పొద్దుతిరుగుడు, 1 ః 2 నిష్పత్తిలో కంది + పొద్దు తిరుగుడు సాగు చేయవచ్చు. ఎకరానికి 2.5 – 3 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. పంట కాలం 90 – 95 రోజులు. దిగుబడి 5 – 6 క్వింటాళ్లు.
విత్తన రకాలు : కేబీఎస్‌హెచ్- 44, ఎన్‌డీఎస్‌హెచ్-1, డీఆర్‌ఎస్‌హెచ్-1.
ఆముదం : దీని పంటకాలం 120 నుంచి 140 రోజులు. యాసంగిలో అక్టోబర్ రెండో పక్షంలో విత్తుకుంటే అధిక దిగుబడులు పొందవచ్చు. ఆముదం + కంది 1 ః 1 నిష్పత్తిలో అంతర పంటగా సాగు చేసుకోవచ్చు. ఎకరానికి 2 – 2.5 కిలోల విత్తనాలు అవసరమవుతాయి.
ఆవాలు : మోస్తరు బరువైన నేలలు మంచి దిగుబడులను ఇస్తాయి. తేలికపాటి నేలలు, నల్లరేగడి, ఒండ్రు నేలల్లో కూడా పండించవచ్చు. ఎకరానికి 2 – 2.5 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. పంట కాలం 120 – 125 రోజులు, విత్తన రకాలు : పూసా అగ్రాని, వరుణ, పూసా మహల్, నరేంద్ర
కుసుమ : యాసంగి పంటగా దీనిని నాటుకోవచ్చు. నీరు నిల్వని బరువైన తేమ నిలుపుకొనే నల్లరేగడి, నీటి వసతి గల ఎర్ర గరప నేలలు అనుకూలం. 125 – 130 రోజుల పంటకాలం. 4 కిలోల విత్తనాలు ఎకరానికి అవసరమవుతాయి.
మొక్కజొన్న : నీరు ఇంకే నల్లరేగడి, ఎర్ర నేలలు, ఒండ్రు, ఇసుక నేలలు అనుకూలమైనవి. మొక్కజొన్నను యాసంగిలో నవంబర్ మూడో వారం వరకు విత్తుకోవచ్చు. పంట కాలం 105 – 120 రోజులు. 8 కిలోల విత్తనాలు ఎకరానికి అవసరమవుతాయి.
విత్తన రకాలు : డీహెచ్ఎం-1, డీహెచ్ఎం- 103, డీహెచ్ఎం- 107.
జొన్న : నల్లరేగడి, తేలికైన ఎర్ర నేలలు ఈ పంట సాగుకు అనుకూలం. పంటకాలం 110- 115 రోజులు. ఎకరానికి 3- 4 కిలోల విత్తనాలు అవసరమవుతాయి.
విత్తన రకాలు : సీఎస్హెచ్- 13, సీఎస్హెచ్- 16, సీఎస్హెచ్- 14, పీఎస్వీ-1
అలసంద : నల్లరేగడి, ఎర్రనేలలు, నీరు నిల్వని నేలలు అనుకూలం. యాసంగి పంటగా ఫిబ్రవరి వరకు నాటుకోవచ్చు. పంట కాలం 110 రోజులు. ఎకరానికి 8- 10 కిలోల విత్తనాలు అవసరం. పశుగ్రాసంగా, పచ్చిరొట్టగా వేస్తే 12- 14 కిలోల విత్తనాలు అవసరం.
విత్తన రకాలు : జీసీ- 3, వీ- 240, సీ- 152.
కంది : యాసంగిలో స్వల్పకాలిక రకాలు సాగు చేయవచ్చు. నల్లరేగడి, ఎర్రచెల్క నేలలు అనుకూలం. 120 – 130 రోజుల పంటకాలం.
విత్తన రకాలు : ఎల్‌ఆర్‌జీ – 41, లక్ష్మీ ఐసీపీఎల్- 85063, మారుతీ ఐసీపీ- 8863
పెసర, మినుము : వానకాలం వరి తర్వాత 15 నవంబర్ నుంచి డిసెంబర్ మొదటి వారం వరకు విత్తుకోవచ్చు. తేమను పట్టి ఉంచే అన్ని రకాల భూముల్లో సాగు చేసుకోవచ్చు. మినుము సాగుకు అత్యంత బరువైన నల్లరేగడి నేలలు అనుకూలం. పెసర 60 – 65 రోజుల్లో పంట కోతకు వస్తుంది. మినుము 70- 80 రోజుల్లో కోతకు వస్తుంది.
పెసర : డబ్ల్యూజీజీ – 37 (ఏకశిల), ఎజీజీ – 347, (మాదిర పెసర) మినుము : ఎల్బీజీ – 752, ఎల్బీజీ – 20, ఎల్బీజీ – 26 పీయూ- 31
నేల స్వభావం.. అనువైన పంటలు
- నీటి సౌకర్యం కలిగిన ఎర్రనేలల్లో వేరుశనగ, ఆముదం, పొద్దు తిరుగుడు, కంది, మినుము, అలసంద, జొన్న, మొక్కజొన్న, కుసుమ, నువ్వుల సాగు అనుకూలం.
- నీటి సౌకర్యం కలిగిన నల్లరేగడి నేలల్లో ఆముదం, పొద్దు తిరుగుడు, మొక్కజొన్న, పెసర, మినుము, నువ్వులు వేయవచ్చు.
- వర్షాధారపు ఎర్రనేలల్లో ఉలువలు, జొన్నలు, వర్షాధారపు నల్లరేగడి నేలల్లో శనగ, ఆవాలు, కుసుమ పంటలు వేస్తే మంచిది.
ఆరుతడి పంటలతోనే రైతులకు మేలు
ప్రస్తుత పరిస్థితిలో యాసంగిలో ఆరు తడి పంటల సాగుతోనే రైతుకు మేలు జరుగుతుంది. ఆరుతడి పంటలుగా ఒకే పంటను కాకుండా అంతర పంటలు సాగు చేయడం ద్వారా రైతు నికర ఆదాయం పెరుగుతుంది. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేయడంతో భూగర్భ జలాలు అడుగంటిపోకుండా ఉంటాయి. పప్పు దినుసులు సాగు చేస్తే వాటి మొక్కల వేర్లు గాలిలోని నత్రజనిని స్థిరీకరించి భూసారం పెరుగుతుంది. ఉపయోగకర సూక్ష్మజీవుల సంఖ్య సైతం పెరుగుతుంది. నేల స్వభావం, వాతావరణ పరిస్థితులను బట్టి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేస్తే రైతులు ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు అధిక లాభాలు పొందవచ్చు.
– దొంగరి నరేశ్, కేవీకే ఇన్చార్జి ప్రోగ్రాం కో ఆర్డినేటర్, గడ్డిపల్లి
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

