నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడంతో ఆయకట్టు పరిధిలో ఈ సీజన్లో వరి సాగు చాలా వరకు తగ్గింది. యాసంగిలోనూ సరిపడా నీళ్లు అందే పరిస్థితులు కనిపించడం లేదు.
యాసంగిలో వరి సాగు చేసే రైతులు అధిక దిగుబడులు సాధించాలంటే అనువైన విత్తన రకాలను ఎంపిక చేసుకోవాలని గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త దొంగరి నరేశ్ సూచించారు.