యాసంగికి అనువైన వరి వంగడాలు ఇవే..
యాసంగిలో వరి సాగు చేసే రైతులు అధిక దిగుబడులు సాధించాలంటే అనువైన విత్తన రకాలను ఎంపిక చేసుకోవాలని గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త దొంగరి నరేశ్ సూచించారు.
గరిడేపల్లి, నవంబర్ 22 : యాసంగిలో వరి సాగు చేసే రైతులు అధిక దిగుబడులు సాధించాలంటే అనువైన విత్తన రకాలను ఎంపిక చేసుకోవాలని గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త దొంగరి నరేశ్ సూచించారు. యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చునని ఆయన పేర్కొన్నారు. అదనపు సమాచారం కోసం 9290615952 నంబర్‌ను సంప్రదించవచ్చని వివరించారు. కొత్త వంగడాలకు సంబంధించి ఆయన తెలిపిన వివరాలు…
జేజీఎల్ 18047 ఈ రకం వానకాలం, యాసంగిలో సాగు చేయడానికి అనుకూలం. పంటకాలం 120 రోజులు. గింజ సన్నగా, పొడవుగా ఉంటుంది. కోత సమయంలో గింజ రాలడం 1010తో పోలిస్తే తక్కువ. సగటు దిగుబడి సైతం 1010 కంటే 5 శాతం అధికంగా ఉంటుంది. దీనిని సాధారణంగా బతుకమ్మ రకం అంటారు.
కేఎన్ఎం 118 : వానకాలం, యాసంగిల్లో సాగు చేయవచ్చు. పంటకాలం 120-125 రోజులు. 100-105 సెంటీమీటర్ల ఎత్తుకు పెరుగుతున్నది. అగ్గి తెగులును తట్టుకుంటుంది. సన్నరకం, గింజ పొడవు. కోత సమయంలో గింజ రాలడం తక్కువ. పంట దిగుబడి ఎకరాకు సగటున 28-32 క్వింటాళ్ల వరకు వస్తుంది. దీనిని కూనారం సన్నాలు అనే పేరుతో పిలుస్తారు.
డబ్ల్యూజీఎల్ 20471 : 120 రోజుల పంట కాలం. ఇతర రకాలతో పోలిస్తే నీటి ఎద్దడిని తట్టుకునే స్వభావం ఎక్కువ. సాధారణంగా దీనిని ఎర్రమల్లెలు పేరుతో పిలుస్తుంటారు.
ఆర్ఎన్ఆర్ 10754 : 125 రోజుల పంట కాలం ఉంటుంది. అగ్గి తెగులు, ఎండాకు తెగులును తట్టుకుటుంది.
కాటన్దొర సన్నాలు ఎంటీయూ 1010: 120 రోజుల పంటకాలం. సుడిదోమ, అగ్గి తెగులును కొంత వరకు తట్టుకుంటుంది.
శ్రీవృతి (ఎంటీయూ 1121): 130 రోజుల పంట కాలం. సుడిదోమ, అగ్గి తెగులును కొంతమేర తట్టుకునే స్వభావం ఉంటుంది.
చంద్ర (ఎంటీయూ 1153) : 120- 125 రోజులు పంటకాలం. అధిక దిగుబడి నిచ్చే లావు గింజ రకం.
తరంగిణి (ఎంటీయూ 1156): 125 రోజుల పంట కాలం. అగ్గి తెగులు, దోమను తట్టుకునే స్వభావం ఉంటుంది.
డబ్ల్యూజీఎల్ 347: వానకాలం, యాసంగిలో సాగు చేయవచ్చు. పంటకాలం 125-130 రోజులు. చలిని తట్టుకునే స్వభావం కలిగిన సన్నరకం. దీనిని సోమనాథ్ అని పిలుస్తుంటారు.
డబ్ల్యూజీఎల్ 505: దీనిని కూడా రెండు సీజన్లలో సాగు చేసుకోవచ్చు. పంటకాలం 120-125 రోజులు. ఉల్లికోడును తట్టుకోగల సన్నరకం.
బీపీటీ 2615 : దీనిని రెండు సీజన్లలో సాగు చేసుకోవచ్చు. పంటకాలం 120 రోజులు. సుడిదోమను తట్టుకోగల సన్నరకం.
ఆర్ఎన్ఆర్15048 : దీనిని వానకాలం పంటగా అయితే ఆలస్యం, యాసంగి పంట సాగు చేసుకోవచ్చు. పంట కాలం 120-125 రోజులు. ఇది అగ్గి తెగులును తట్టుకునే రకం. ఇతర చీడపీడల సమస్య కూడా తక్కువ. తెలంగాణ సోనాగా పిలుస్తారు. ఈ రకంలో ైగ్లెసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల చక్కెర వ్యాధిగ్రస్తులకు ఈ రకం బియ్యం చాలా అనుకూలం.
జేజీఎల్ 1118 : దీనిని రెండు సీజన్లలో నాటుకోవచ్చు. పంటకాలం 120-125 రోజులు. ఇది ఉల్లికోడును తట్టుకుంటుంది. సన్నరకం. ఆలస్యంగా నాటుకోవడానికి అనువైనది.
జేజీఎల్ 11727 : వానకాలం, యాసంగిలో సాగు చేసుకునేందుకు అనువైన రకం. పంటకాలం 135 రోజులు. ఇది ఉల్లికోడు, అగ్గితెగులు, ఎండాకు తెగులును తట్టుకునే సన్నరకం.దీనిని ప్రాణహిత అంటారు.
డబ్ల్యూజీఎల్ 283 : ఇది యాసంగి పంటగా సాగు చేసుకునేందుకు అనువైన రకం. పంటకాలం 125 రోజులు. గింజ సన్నగా, పొడవుగా ఉంటుంది. సుడిదోమను, చలిని తట్టుకుంటుంది.
డబ్ల్యూజీఎల్ 32100: ఇది వానకాలం పంటగా సాగుచేసేందుకు అనువైన సన్నరకం. పంటకాలం 135 రోజులు. దీనిని సాధారణంగా వరంగల్ సన్నాలు అంటారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

