జిల్లాలో యాసంగి సాగు పనులు జోరందుకున్నాయి. గతేడాది 1.04 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, ఈ యేడాది ఇప్పటికే 62,524 ఎకరాల్లో పంటలు వేశారు. ఇందులో అత్యధికంగా వరి సాగవుతున్నది.
యాసంగిలో వరి సాగు చేసే రైతులు అధిక దిగుబడులు సాధించాలంటే అనువైన విత్తన రకాలను ఎంపిక చేసుకోవాలని గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త దొంగరి నరేశ్ సూచించారు.