కట్టంగూర్, జూన్ 20 : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా ఇస్తుందని బీజేపీ కట్టంగూర్ మండల ప్రధాన కార్యదర్శి గున్నాల నాగరాజు అన్నారు. శుక్రవారం కట్టంగూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత మూడు ధపాలుగా ఇవ్వని రైతు భరోసా ఎన్నికల ముందు ఇవ్వడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. అమలు కానీ హామీలిచ్చి అధికారంలోని రాగానే నిధులు లేవని కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ 11 ఏళ్లల్లో దేశ ప్రజలకు సుస్థిర పాలన అందించాడని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు. ఈ సమావేశంలో జూలూరి నాగరాజు, బత్తిని నాగరాజు. ఐతగోని శివ, చొక్కల్లా చరణ్, కాడింగ్ శ్రవణ్, కొరివి నాగరాజు పాల్గొన్నారు.