నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 13(నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 10 నుంచి15 ఎకరాలు, 20 నుంచి25 ఎకరాల లోపు ఉన్న రైతులకు రైతుబంధు డబ్బులను బుధవారం ప్రభుత్వం విడుదల చేసింది. యాసంగి సీజన్‌కు సంబంధించి జనవరిలోనే రైతుబంధు డబ్బులు ఖాతాల్లో జమ చేసిన విషయం తెలిసిందే. కానీ 10 ఎకరాలకు పైన ఉన్న రైతులవి సాంకేతికంగా పెండింగ్‌లో పడినట్లు సమాచారం. దాంతో పెండింగ్‌లో ఉన్న నల్లగొండ జిల్లాలోని 7,573 మంది రైతులకు పడాల్సిన రూ.39కోట్ల రైతుబంధు డబ్బులను ప్రభుత్వం విడుదల చేసింది. ఒకటి,రెండు రోజుల్లో రైతుల ఖాతాల జమ కానున్నట్లు రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రత్యేక కృతజ్ఞతలు : చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి
రైతుబంధు డబ్బులు విడుదల చేయడంపై రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు నల్లగొండ జిల్లా రైతుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు సహకరించిన మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది రైతు ప్రభుత్వమని, రైతుల సం క్షేమం కోసం పనిచేస్తుందని శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.