నల్లగొండ సిటీ జూన్ 4 : ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి పేర్కొన్నారు. గురువారం నల్లగొండ డిపోను ఆయన సందర్శించారు. ఈ సందర్భం గా ఆయన బస్టాండ్ ప్రాంగణంతో పాటు డిపో పరిసరాలను ఆర్ఎం జానిరెడ్డి కలిసి పరిశీలించారు. అనంతరం బస్టాండ్ గ్యారేజీ విభాగంలో మొక్క నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామానికి బస్సు నడిపేలా కృషి చేయాలన్నారు.
బస్టాండ్ ప్లాట్ ఫారం విస్తరణ కు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బస్టాండ్లో పలు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని అన్నారు. అనంతరం పలు రికార్డులను తనిఖీ చేశారు. సంస్థ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రయాణికుల ఫిర్యాదుల పట్ల వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ జోనల్ అధికారి ఏకే ఖాన్, డిపో మేనేజర్లు తదితరులు ఉన్నారు.