దేవరకొండ రూరల్, జూన్ 11 : దేవరకొండ ఆర్టీసీ కండక్టర్ దార యాదయ్య, డ్రైవర్ నజీరుద్దీన్ బస్సులో దొరికిన బంగారం, కొంత నగదు ఉన్న బాక్స్ ను డిపో అధికారులకు అందజేసి నిజాయితీ చాటుకున్నారు. దేవరకొండ – హైదరాబాద్ రూట్ లో నడుస్తున్న బస్సులో బుధవారం ఓ మహిళా ప్రయాణికురాలు చింతపల్లి నుంచి సంతోష్ నగర్‌కు ప్రయాణిస్తుంది. బంగారు చెవి రింగులు (అర్థ తులం), రూ.650 ఉన్న బాక్స్ ను బస్సులో మర్చిపోయినట్లు తెలిపారు. కండక్టర్ యాదయ్య, డ్రైవర్ నజీరుద్దీన్ గమనించి బాక్స్‌ను భద్రంగా దేవరకొండలో అందజేశారు. ఆర్టీసీ ఏడీసీ ఉపేందర్, సెక్యూరిటీ సిబ్బంది సమక్షంలో విచారణ చేసి పోగొట్టుకున్న కుటుంబ సభ్యులకు అందజేశారు. నిజాయితీ చాటుకున్న సిబ్బందికి ఆర్టీసీ అధికారులు అభినందనలు తెలిపారు. బాధిత కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.
Devarakonda Rural : నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ బస్ కండక్టర్, డ్రైవర్