మిర్యాలగూడ, డిసెంబర్ 5 : దామరచర్ల మండలం కల్లేపల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి మాజీ ఎమ్మెల్యే నల్లమోత భాస్కర్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. శుక్రవారం పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మె ల్యే నల్లమోత భాస్కర్‌రావు గులాబీ కండువాలు కప్పి వారిని బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కల్లేపల్లిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు వివరించాలని కోరారు.
మిర్యాలగూడ మండలం కాల్వపల్లితండా గ్రామానికి చెందిన కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బాదావత్ వనిత ప్రతాప్సింగ్నాయక్, కాంగ్రెస్, టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఆ పార్టీలకు రాజీనామా చేసి మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. శుక్రవారం పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. రెండేండ్ల కాంగ్రెస్ అవినీతి పాలనలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు చేయకుండా కేవలం కమీషన్ల కోసం మాత్రమే ఈ క్యాబినేట్ పని చేస్తోందన్నారు. కాంగ్రెస్ నాయకులకు బుద్ధి రావాలంటే పంచాయతీ ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ జెండాను ఎగరేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మట్టపల్లి సైదయ్య యాదవ్, ఎండీ యూసుఫ్, కుం దూరు వీరకోటిరెడ్డి, ఆంగోతు హాతీరాం నాయక్, పాచు నా యక్, జెట్టి లింగయ్య, భిక్యా నాయక్, తలకొప్పుల సైదులు, చెన్నబోయిన వీరయ్య, రామరాజు, సేవ్యా నాయక్, మేఘా నాయక్, ఆంజనేయులు, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, బాషానాయక్, వనిత ప్రతాప్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
దేవరకొండరూరల్, డిసెంబర్ 5: దేవరకొండ మండలంలో కాంగ్రెస్‌కు బిగ్‌షాక్ తగిలింది. మండలంలోని జిల్లేపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు 80 మంది ఆ పార్టీని వీడి శుక్రవారం బీఆర్ఎస్లో చేరారు. దేవరకొండ పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ వారందరికీ గులాబీ కండువాలు కప్పి ఆహానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ను చిత్తుచిత్తుగా ఓడిస్తేనే పథకాలు అమలవుతాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లల్లో ఒక్క హామీని అమలు చేయలేదని ఆరోపించారు. కేసీఆర్ కిట్టు పథకంలో రూ.13 వేలు ఇచ్చినట్లు గుర్తు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ చెప్పని హామీలను చేసి చూపించారని అన్నారు. రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలనే అమలు చేయడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో ఊర్లల్లో ట్రాక్టర్లకు డీజిల్‌కు డబ్బులు లేవన్నారు. సంకు, కొండల్‌రెడ్డి, శైలేందర్‌రెడ్డి, వెంకటయ్య పాల్గొన్నారు.