Renuka Yellamma kalyanam | నల్లగొండ రూరల్, ఆగస్టు 19 : గ్రామ దేవతల ఆశీస్సులతోనే ప్రజలకు సుఖశాంతులు కలుగుతాయని నల్లగొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, తిప్పర్తి మాజీ జెడ్పిటీసీ పాశం రామ్ రెడ్డిలు అన్నారు.
వారు నల్గొండ మండలంలోని పెద్ద సూరారం గ్రామంలో తిప్పర్తి మాజీ వైస్ ఎంపీపీ పెండెం రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవానికి హాజరై ప్రత్యేక పూజలు చేశారు.
ఈ ఎల్లమ్మ వేడుకకు గ్రామంలోని ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు కోట్ల జయపాల్ రెడ్డి, కిన్నెర అంజి, ముత్తినేని శ్యాంసుందర్, మొయిస్, సతీష్ లు పాల్గొన్నారు.
Vice president | ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ జడ్జి..!
Yellampally project | ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పై నుంచి రాకపోకలు బంద్
TLM Mela | టీఎల్ఎం మేళాతో బోధన సులభతరం : ఎంఈవో చంద్రశేఖర్ రెడ్డి