శాలిగౌరారం, జూలై 17 : భూ సమస్యల పరిష్కారానికి రీ సర్వే కార్యక్రమం నిర్వహిస్తట్లు నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. గురువారం శాలిగౌరారం మండలంలోని తక్కెళ్లపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని వద్దిపాల గ్రామంలో భూ రీ సర్వే కార్యక్రమంఫై గ్రామ సభ నిర్వహించారు. ఈ సదస్సుకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతుల భూములు నిజమైన రైతుల పేరుమీద ఉన్నాయా లేవా అనేది ఈ సర్వేలో తేట తెల్లం కానుందని అన్నారు. పెండింగ్లో ఉన్న సమస్యలను, ఇతరుల పేరు మీద ఉన్న పట్టా మార్పిడి తదితర అంశాలపై గ్రామ సభ వేదికగా పలువురు రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి, తాసీల్దార్ మాధవరావు, ఎంపీడీఓ రజిత పాల్గొన్నారు.