‘మత సామరస్యానికి ప్రతీక రంజాన్’
మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ పండుగ అని బీఆర్ఎస్ పెన్‌పహాడ్ మండలాధ్యక్షుడు దొంగరి యుగేందర్ అన్నారు. శనివారం రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలోని వివిధ గ్రామాలలో ముస్లింలు ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
పెన్‌పహాడ్, మార్చి 21 : మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ పండుగ అని బీఆర్ఎస్ పెన్‌పహాడ్ మండలాధ్యక్షుడు దొంగరి యుగేందర్ అన్నారు. శనివారం రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలోని వివిధ గ్రామాలలో ముస్లింలు ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లింలకు యూగేందర్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. దోసపహాడ్‌లో గల ఈద్గా వద్ద జరిపిన ప్రత్యేక ప్రార్థనలో ఆయన పాల్గొని మాట్లాడారు. రంజాన్ పండుగ పవిత్రతకు, త్యాగానికి చిహ్నమన్నారు. సేవా దృక్పథం, భక్తి ప్రపత్తులు, సోదర భావాలు, మత సామరస్యాన్ని చాటి చెప్పే ఈ పండుగను ముస్లింలందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు షేక్ అమిరుల్లి కాసిం, షేక్ పెద్దమనిషి కాసిం, షేక్ బాలే జుబేర్, షేక్ హుస్సేన్, షేక్ చిన్న కాసిం, షేక్ జానీ, షేక్ మల్లెపూలు సైదా, షేక్ బిక్కన్ సాబ్, షేక్ బాల సైదా, దోసపహాడ్, అనాజిపురం గ్రామానికి చెందిన ముస్లింలు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
- Tags
- BRS
- Penpahad
- Ramadan
- Suryapet News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

