మునుగోడు, మార్చి 28 : తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం సహాయ కార్యదర్శిగా నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కచలాపురం గ్రామానికి చెందిన గురుజ రామచంద్రం ఎన్నికయ్యారు. నిజామాబాద్‌లో ఈ నెల 25, 26 ,27 తేదీల్లో జరిగిన రాష్ట్ర మహాసభలో ఆయనను ఎన్నుకున్నారు. రైతు కుటుంబంలో జన్మించిన రామచంద్రం గ్రామ సర్పంచ్‌గా, రైతు సంఘం నాయకుడుగా పనిచేశారు. ప్రస్తుతం జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన ఎన్నికపై పలువురు హర్ష వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రామచంద్రం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం పక్షాన రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు కొనసాగుతామని తెలిపారు.