నల్లగొండ : తెలంగాణ అభివృద్ధికి ఆటంకంగా ఉన్న మోదీ వద్ద కాంట్రాక్ట్ పనులను దక్కించుకోవడానికే రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరారని రాష్ట్ర మంత్రి జగదీష్‌రెడ్డి ఆరోపించారు. జిల్లాలో కొత్తగా ఏర్పాటైన ఘట్టుప్పల్ మండలం ఏర్పాటు సభలో మంత్రి పాల్గొని మాట్లాడారు. నాడు బ్రిటీష్ వారికి జమీందార్లు మద్దతిచ్చినట్లుగానే బీజేపీకి రాజగోపాల్‌రెడ్డి నేడు మద్దతిస్తున్నారని ఆరోపించారు. హుజురానగర్లో ఎమ్మెల్యే రాజీనామా, సాగర్‌లో ఎమ్మెల్యే చనిపోతే ఉప ఎన్నికలు జరిగాయని కాని మునుగోడులో మాత్రం తన స్వార్థం కోసం పదవికి రాజీనామా చేయడంతో ఎన్నికలు జరుగబోతున్నాయని అన్నారు.
ప్రధాని మోదీ దోస్తులకు భూమి, కరెంట్‌ను కట్టబెట్టే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. దేశంలోనే ఎక్కడా లేని పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని, గుజరాత్లో కూడా అమలు కావడం లేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే మునుగోడు అభివృద్ధి చెందుతుందని తెలిపారు.జిల్లాలో ఫ్లోరైడ్ ను తరిమి కొట్టారని, సాగు నీటి కల్పనకు కృషి జరిగిందని, రాష్ట్రంలో ఆకలిని పారదొలారని మంత్రి వెల్లడించారు.
దేశ భవిష్యత్ కోసం కేసీఆర్‌ను ఢిల్లీ కి పంపుదామని అన్నారు. రాబోయే ఎన్నికల్లో మునుగోడు నియోజక వర్గంలో ఘట్టుప్పల్ మండలం భారీ మెజార్టీని ఇచ్చి కేసీఆర్‌కు గిఫ్ట్‌గా ఇవ్వాలని కోరా రు. మునుగోడు అభి వృద్ధి కుసుకుంట్ల తోనే జరిగిందని తెలిపారు. ప్రజలు ఐక్యమత్యంతో ఉంటే ఘట్టుపల్ మండలం ఏర్పాటు చేసుకున్నట్లుగానే అన్ని అభివృద్ధి పనులు చేసుకోవచ్చని మంత్రి సూచించారు.