మోత్కూరు, మార్చి 2 : కేంద్ర ప్రభుత్వంపై పోరాటాలకు ప్రజలు సిద్ధం కావాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ గురువారం మోత్కూరులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డితో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అహంకార పూరితంగా పాలన కొనసాగిస్తుందన్నారు. ఎన్నికల సమయంలో నిశబ్ధంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం.. ఎన్నికలు అయిపోగానే పేద ప్రజలపై ధరల భారం మెపుతుందని విమర్శించారు. దేశ సంపదనంతా అంబానీ, ఆదానీలకు దారధత్తం చేస్తున్నారని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసి ఉద్యోగులకు ఉపాధి లేకుండా చేస్తున్నట్లు తెలిపారు. కంచర్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీకి తగిన గుణపాఠం చెప్పేందుకు మహిళలంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పొన్నెబోయిన రమేశ్, మున్సిపల్ చైర్పర్సన్ తీపిరెడ్డి సావిత్రీమేఘారెడ్డి, జడ్పీటీసీ గోరుపల్లి శారదాసంతోష్‌రెడ్డి, ఎంపీపీ రచ్చ కల్పనాలక్ష్మీనర్సింహారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొణతం యాకూబ్‌రెడ్డి, బీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు బొడ్డుపల్లి కల్యాణ్ చక్రవర్తి, రైతు బంధు సమితి మండల కో అర్డినేటర్లు కొండ సోంమల్లు, మేఘారెడ్డి, అడ్డగూడూరు మండలాధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
రామన్నపేట : మండలకేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు చిట్యాల – భువనగిరి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మందడి ఉదయ్‌రెడ్డి, ఎంపీపీ కన్నెబోయిన జ్యోతీబలరాం, సింగిల్ విండో చైర్మన్ నంద్యాల భిక్షంరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ కంభంపాటి శ్రీనివాస్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు బొక్క మాధవరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పోషబోయిన మల్లేశం, పట్టణాధ్యక్షుడు పోతరాజు సాయికుమార్, పున్న జగన్మోహన్, నీల దయాకర్, గుత్తా నర్సిరెడ్డి, అప్పం లక్ష్మీనర్సు, మెట్టు మహేందర్‌రెడ్డి, కోళ్ల స్వామి, అంతటి రమేశ్, దోమల సతీశ్, బద్దుల రమేశ్, కూనూరు ముత్తయ్య, జాడ సంతోష్, ఇనాయత్బేగ్, గర్దాసు విక్రం, ఆవుల నరేందర్, మామిండ్ల అశోక్, ఆవుల శ్రీధర్, బాలగోని శివ, లవణం రాము పాల్గొన్నారు.
అడ్డగూడూరు : మండలకేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీరాముల జ్యోతీఅయోధ్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి చౌగోని సత్యంగౌడ్, మండల కోఆప్షన్ సభ్యుడు మాదానూ ఆంథోని, సర్పంచ్ బాలెంల త్రివేణి, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు నాగులపల్లి దేవగిరి, నాయకులు జక్కుల యాదగిరి, బాలెంల విద్యాసాగర్, బాలెంల అరవింద్, ఎస్కే జహంగీర్ పాల్గొన్నారు.
భూదాన్‌పోచంపల్లి : భూదాన్‌పోచంపల్లిలోని నేతాజీ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ మండల, పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ మాడుగుల ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మీశ్రీనివాస్, జడ్పీటీసీ కోట పుష్పలతామల్లారెడ్డి, బీఆర్ఎస్ మండల, పట్టణాధ్యక్షులు పాటి సుధాకర్‌రెడ్డి, సీత వెంకటేశం, కౌన్సిలర్లు పెద్దల చక్రపాణి, దేవరాయకుమార్, కుడికాల అఖిలాబలరాం, నాయకులు కందాడి భూపాల్‌రెడ్డి, కందడి సుధాకర్‌రెడ్డి, పగిళ్ల సుధాకర్‌రెడ్డి, చంద్రం యాదవ్, చిలువేరు బాలనర్సింహ, అంకం పాండు, గునిగంటి మల్లేశ్‌గౌడ్, సీత శ్రవణ్, చింతకింది కిరణ్, సుమన్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
భువనగిరి కలెక్టరేట్ : గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మండలంలోనిపలు గ్రామాల్లో కట్టెల పొయ్యిపై వంటావార్పు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ నరాల నిర్మలావెంకటస్వామి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జనగాం పాండు, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు ఎడ్ల రాజిరెడ్డి, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నీల ఓంప్రకాశ్‌గౌడ్, మాజీ ఎంపీపీ అతికం లక్ష్మీనారాయణగౌడ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ బల్గూరి మధుసూదన్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ సందెల సుధాకర్, మదర్ డెయిరీ డైరెక్టర్ కస్తూరి పాండు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కేతావత్ మహేందర్‌నాయక్, బీఆర్ఎస్ నాయకులు ర్యాకల శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
చౌటుప్పల్, మార్చి 2 : గ్యాస్ ధరలు తగ్గించాలని శుక్రవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తాసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు పార్టీ మండలాధ్యక్షుడు గిర్కటి నిరంజన్ గౌడ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పాల్గొంటారని, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
భువనగిరి అర్బన్ : భువనగిరి పట్టణంలోని బాబూ జగ్జీవన్ రావు చౌరస్తాలో శుక్రవారం నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఏవీ కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాసరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు నిర్వహించే ధర్నాలో ప్రజాపతినిధులు, నాయకులు అధికసంఖ్యలో పాల్గొనాలని కోరారు.