మునుగోడు, ఆగస్టు 13 : కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బుధవారం మునుగోడు సెంటర్లో రైతులు, కార్మికులు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీపీఐ మండల కార్యదర్శి చాపల శ్రీను మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మిక, రైతు వ్యతిరేకి అన్నారు. అమెరికా విధించిన సుంకాలతో అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్న చందంగా రైతుల పరిస్థితి తయారైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల కార్యదర్శి బెల్లం శివయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు పందుల చిన్న నరసింహ, రైతు సంఘం మండల కమిటీ సభ్యులు అందుగుల నరేశ్, సిరగోని మారయ్య, సైదులు, గోలి హుస్సేన్, మాలాద్రి, మందుల వెంకన్న, ఈద సైదులు పాల్గొన్నారు.