Mahatma Gandhi University | నల్గొండ విద్యా విభాగం (రామగిరి), మార్చి 7: నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఇంటర్నల్ సెల్‌ను ఏర్పాటు చేస్తూ శుక్రవారం సాయంత్రం రిజిస్ర్టార్ ప్రొఫెసర్ అల్వాల రవి ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ చైర్‌పర్సన్‌గా ఎంజీయూ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఎం.వసంతను నియమించారు. మహిళలు, విద్యార్థినులపై లైంగిక వేధింపుల సంఘటనల విచారణలు, వారి రక్షణ కోసం ఈ అంతర్గత కమిటీ పూర్తిస్థాయిలో పనిచేస్తుంది.
కమిటీలో సభ్యులు వీరే…
ప్రొఫెసర్ కొప్పుల అంజిరెడ్డి( డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్), ప్రొఫెసర్ రేఖ (డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ), ప్రొఫెసర్ బి విజయలక్ష్మి (ఉస్మానియా యూనివర్సిటీ లా కళాశాల, హైదరాబాద్), నల్గొండ మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సభ్యులుగా వ్యవహరించనున్నారు. ఈ కమిటీ రెండేళ్ల పాటు కొనసాగిస్తూ సేవలు అందించనున్నారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.