మోత్కూరు, మే 5: ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాం టాలను వేగవంతం చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో చేశారు. మంగళవారం మండలకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పేరుకుపోయిన ధాన్యం రాశులను బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. అనంతరం మార్కెట్ యార్డు ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై రైతులతో కలసి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందన్నారు. నెల రోజుల కింద గ్రామాల నుంచి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చినా ఇప్పటి వరకూ 10శాతం కూడా ధాన్యం కొనుగోలు చేయలేదన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం ఎగుమతికి నాలుగు రోజులు పడుతుండగా, దిగుమతికి మరో మూడురోజులు పడుతోందన్నారు.
ప్రభుత్వ పెద్దలు కొందరు మిల్లర్లతో కుమ్మక్కయి 40 కిలోల బస్తాకు 3 కిలోల చొప్పున తరుగు పేరుతో కటింగ్ చేసి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. అధికారులు తక్షణమే రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల, మున్సిపల్ అధ్యక్షుడు రమేశ్, జంగ శ్రీను, వ్యవసాయమార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు కొణతం యాకూబ్‌రెడ్డి, చిప్పలపల్లి మహేందర్‌నాధ్, సహకార సంఘం డైరెక్టర్లు పురుగుల మల్ల య్య, సామ పద్మారెడ్డి, మాజీ సర్పంచులు బయ్యని పిచ్చయ్య, కడమంచి వస్తాద్, నాయకులు దాసరి తిరుమలేశ్, పానుగుళ్ల విష్ణు, గజ్జి మల్లేశ్, శ్రీను, మత్స్యగిరి, సత్తిరెడ్డి, పరమేశ్, శ్రీను, వెంకన్న, జంగ సతీశ్, మల్లేశ్, వెంకన్న, అన్నందాస్ సాగర్ పాల్గొన్నారు.