యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : పంచాయతీ ఎన్నికలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరి కొన్ని గంటల్లో పోలింగ్ షురూ కానున్నది. ఇప్పటికే అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహించగా.. 48 గంటల ముందే మైకులు మూగబోయాయి. ఫలితాలు వెలువడే వరకు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. దీంతో కొన్ని చోట్ల రాత్రి అయితే మందు పార్టీలు ప్రారంభమవుతునన్నాయి. ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు దకించుకునేందుకు బీఆర్ఎస్ క్షేత్ర స్థాయిలో చక్రం తిప్పుతున్నది.
అధికార యంత్రాంగం పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమై ఉంది. పోలింగ్ నిర్వహించే పీవోలు, ఏపీవోలకు శిక్షణ ఇచ్చారు. మండలాన్ని జోన్లు, రూట్లుగా విభజించారు. పోలింగ్ సామగ్రిని మండలకేంద్రంలోని ప్రత్యేక గదుల్లో భద్రపరిచారు. బందోబస్తు కోసం పోలీసులను పోలింగ్ కేంద్రాల వారీగా కేటాయించారు. మండల కేంద్రా ల్లో డిస్ట్రిబ్యూషన్, రికవరీ సెంటర్ను ఏర్పాటు చేశా రు. ఈనెల 10వ తేదీ ఉదయం నుంచి పోలింగ్ సామగ్రిని, ఉద్యోగులను గ్రామ పంచాయతీలకు తరలించనున్నారు.
అభ్యర్థులు ఓ వైపు పగలు ముమ్మర ప్రచారం చేస్తూనే రాత్రి వేళల్లో వివిధ వర్గాలతో సమావేశమవుతున్నారు. సమభావన సంఘాల మహిళలు, కాల నీ సంఘాలు, కాలనీ ప్రజలతో భేటీ అవుతున్నారు. తమకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. గెలిస్తే చేయాల్సిన పనులపై హామీలు ఇస్తున్నారు. కొంత మంది నేతలు స్వయంగా సొంత డబ్బుతో అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇస్తున్నారు. కుల సం ఘాలతో సమావేశం కావొద్దని ఎన్నికల సంఘం నిబంధనల నేపథ్యంలో రాత్రి వేళల్లో రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో సాయం త్రం అయితే ఓటర్లను మద్యంలో ముంచెత్తుతున్నా రు. ప్రత్యేకంగా ఎంపిక చేసిన వారిని తమ అనుచరుల ఇళ్లకు రప్పించి దావత్లు ఇస్తున్నారు. హైదరాబాద్లో ఉంటున్న ఓటర్లకు హోటళ్లలో సిట్టింగ్లు ఏర్పాటు చేస్తున్నారు.
ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో రెండు రోజులపాటు మద్యం దుకాణాలు బంద్ కానునన్నాయి. యాదా ద్రి పరిధిలో మంగళవారం సాయంత్రం నుంచి 11వ తేదీ సాయంత్రం వరకు మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు, ఇతర మద్యం క్రయ విక్రయాలు నిలిపివేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజుల్లో సాధారణ మద్యం షాపులతోపాటు ఇతర మద్యం అమ్మకాలకు లైసెన్సులు పొందిన వారు కూడా ఎటువంటి విక్రయాలు లేదా సర్వ్ చేయడం జరపకూడదని ఆదేశాలు ఇచ్చారు.
ప్రచారం ముగియడంతో అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. ఓటర్లను మచ్చిక చేసుకోవటానికి ఎన్నికల ముందు రోజు రాత్రి, తెల్లవారుజామున మద్యం, నగదు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. ఇందుకోసం రహస్య ప్రదేశాల్లో డబ్బు, మద్యం డంప్ చేసుకుంటున్నారు. ఒకో ఓటుకు ఏరియాను బట్టి వెయ్యి నుంచి మూడు వేల రూపాయల వరకు పంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఓటర్ల జాబితాను తయారు చేసుకొని గుట్టుచప్పుడు కాకుండా ఓటర్లకు చేరవేసేందుకు రంగం సిద్ధం చేశారు.
ఎన్నికల షెడ్యూల్ ప్రకారం మంగళవారం సా యంత్రం ప్రచారం గడువు ముగిసింది. దీంతో ఆఖరిరోజు అభ్యర్థులు ప్రచారంలో జోరు పెం చారు. బడానేతలు, బంధువులు, కుటుంబ సభ్యులతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. వీలైనం త ఎకువ మంది ఓటర్లను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. ర్యాలీలు, సమావేశాలు, ఇంటింటికి వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంతో పాటు ఇత ర రూపాల్లో పెద్ద ఎత్తున ప్రచారం మొ దలు పెట్టా రు. గ్రామగ్రామానికి వెళ్లి గెలిస్తే ఏం చేస్తామో వివరిస్తున్నారు. దీంతో గ్రామాల్లో సం దడి నెలకొంది. మంగళవారం సాయంత్రం ప్రచారం సమాప్తమైం ది. సాయంత్రం తర్వాత సభలు, ఊరేగింపులు సమావేశాలు, ప్రచారాలు, తదితర రాజకీయ అం శాలతో కూడిన సంక్షిప్త సందేశాలు, బల్ ఎస్ఎంఎస్ పంపడంపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఈ సమయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీఆర్ఎస్ వ్యూహ, ప్రతి వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేసింది. పలు చోట్ల ఏకగ్రీవ స్థానాలను కైవసం చేసుకుంది. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతను అందిపుచ్చుకొని కాంగ్రెస్ను మట్టికరిపించాలని భావిస్తున్నది. భువనగిరి మాజీ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి రంగంలోకి దిగారు. అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తూనే.. అసంతృప్తి నేతలను దారికి తెస్తున్నారు. బలమున్న నేతలతో టచ్లోకి వెళ్లి కలిసి పని చేయాలని సూచిస్తున్నారు. మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు.