Nalgonda | ముందస్తు అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు : బీఆర్ఎస్వీ నాయకులు
నిరుద్యోగులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని బీఆర్ఎస్వీ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
నల్లగొండ : నిరుద్యోగులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని బీఆర్ఎస్వీ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్వీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి నాయకులు ఆందోళనలకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో నల్లగొండ జిల్లాలో ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పలువురు బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ ఖాసీం, బీఆర్ఎస్ మైనారిటీ యూత్ నాయకుడు ఒవైజ్ షా, బీఆర్ఎస్వి నాయకుడు చందన్, శోభి, పాల్ రెడ్డి నరేందర్ రెడ్డినిలను ముందస్తుగా అరెస్ట్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్భందించారు.
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల విడుదల కోసం విద్యార్థులు శాంతియుతంగా నిరసన చేపట్టాలని భావిస్తే ప్రభుత్వం పోలీసులతో అణచివేతకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నాయకుల విమర్శించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, విద్యార్థి నాయకులపై అక్రమ అరెస్టులు చేసి ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు అరెస్టులు, నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరని సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

