MGU | నల్గొండ విద్యావిభాగం (రామగిరి) మార్చి 3 : ఇవాళ నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలోని తన చాంబర్లో యూనివర్సిటీ వీసీ, ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ ఇండియా లిమిటెడ్‌తో క్రీడా ప్రాంగణాల అభివృద్ధికై అవగాహన ఒప్పంద సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ.. విద్యతోపాటు క్రీడలను ప్రోత్సహించేలా అత్యంత ఆధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేస్తామని యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. యూనివర్సిటీలోని 2160 స్క్వేర్ మీటర్ల ఇండోర్ స్టేడియం ఫ్లోరింగ్, సింథటిక్ ట్రాక్ నిర్మాణాలపై ఒప్పందం చేశారు.
అదేవిధంగా ఇండోర్ స్టేడియంలో బాస్కెట్‌బాల్, వాలీబాల్ షటిల్ కబడ్డీ వంటి క్రీడలను నిర్వహించేందుకు కోర్టులను ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థులకు ఆయా అంశాలపై శిక్షణ ఇస్తామని చెప్పారు. తెలంగాణలో బీపీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే అర్హత పరీక్షను ఎన్‌జీయూ క్రీడామైదానాల్లో ఉన్నత విద్యా మండలి సహకారంతో విజయవంతంగా నిర్వహించామని సూచించారు.
ఇంజనీరింగ్ ప్రాజెక్టు ఇండియా లిమిటెడ్ ప్రతినిధులు నారాయణ్ నాయక్ మాట్లాడుతూ.. వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థులకు అందుబాటులో ఉండేలా అత్యంత ఆధునిక క్రీడా మైదానాలను నిర్మించి అందజేస్తామని తెలిపారు. అనంతరం ఎంవోయూ పత్రాలను పరస్పరం మార్పిడి చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో రిజిస్టర్ ప్రొఫెసర్ అలవాల రవి, యూనివర్సిటీ ఇన్ఫా స్ట్రక్చర్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆకుల రవి, యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ డైరెక్టర్ డాక్టర్ హరీష్ కుమార్, స్పోర్ట్స్ బోర్డు సహాయ కార్యదర్శి డాక్టర్ ఆర్ మురళి డాక్టర్ వై శ్రీనివాస్ రెడ్డి, స్పోర్ట్స్ బోర్డ్ కోఆర్డినేటర్ డాక్టర్ చింతా శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.
Kerala Man Shot Dead | ఇజ్రాయెల్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నం.. కాల్పుల్లో కేరళ వ్యక్తి మృతి
KTR | కేటీఆర్ సూచనతో కదిలిన అధికారులు.. రంగనాయక సాగర్ కాలువను సందర్శించిన అధికార యంత్రాంగం
Maoists | మనుగడ ఉండదని.. లొంగిపోయిన 14 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు : ఎస్పీ రోహిత్ రాజు