నేరేడుచర్ల, జూన్ 20 : ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని నేరేడుచర్ల ఎంఈఓ సత్యనారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ప్లాంట్స్ గివింగ్ డే కార్యక్రమంలో భాగంగా విద్యార్ధుల చేత తల్లిదండ్రులకు మొక్కల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తల్లిదండ్రులకు కృతజ్ఞతగా విద్యార్థులు మొక్కలు బహుమతిగా ఇవ్వడం ఒక మంచి కార్యక్రమం అన్నారు. మీరు నాటే మొక్కలు భవిష్యత్లో ఎంతో ఉపయోగపడుతాయన్నారు. తల్లికి పండ్లు ఇచ్చే మొక్కలు, తండ్రికి నీడనిచ్చే మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొణతం సత్యనారాయణ రెడ్డి, పాఠశాల హెచ్ఎం బట్టు మధు, ఉపాధ్యాయులు, విద్యార్ధులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.