‘తెలంగాణ గొంతు ప్రపంచానికి వినిపించేలా మరణం చివరి అంచుల వరకు వెళ్లి పోరాడి, ఆనాటి కేంద్రం మెడలు వంచి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన మహోన్నత వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్. కేవలం ఎనిమిదేండ్లలోనే తెలంగాణను ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ధి చేసిన దమ్మున్న నాయకుడు కేసీఆర్ నాయకత్వం కోసం అన్ని రాష్ర్టాల ప్రజలు ఎదురుచూస్తున్నారు’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఉన్న నేపథ్యంలో మంత్రి శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్న సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ మాదిరిగా దేశ భవిష్యత్‌ను మార్చగల దమ్ము, ధైర్యం సీఎం కేసీఆర్‌కు మాత్రమే ఉన్నాయన్నారు. రాష్ట్రంలోని ప్రతి గడపా సంక్షేమ ఫలాలను అందుకుంటున్నదని, ఈ విధమైన పాలన బీఆర్ఎస్తోనే దేశమంతా సాధ్యమని అన్ని రాష్ర్టాల ప్రజలు ఆశ పడుతున్నారని తెలిపారు. అందుకే 4 కోట్ల తెలంగాణ ప్రజలతోపాటు దేశమంతా బీఆర్ఎస్కు జై కొడుతున్నదని పేర్కొన్నారు. బీజేపీ రాక్షస పాలన నుంచి దేశానికి విముక్తి కావాలంటే నూతన నాయకత్వం అవసరమని అంతా నమ్ముతున్నారని, అటువంటి నాయకత్వానికి సీఎం కేసీఆర్ రథసారథిగా ఉండాలని కోరుకుంటున్నారని తెలిపారు. అంతకుముందు దురాజ్‌పల్లి లింగమంతుల జాతరపై కలెక్టరేట్లో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. స్వయంగా పెద్దగట్టుకు వెళ్లి ఏర్పాట్లను పరిశీలించి ఆలయ పాలకవర్గం, అధికార యంత్రాంగానికి సూచనలు ఇచ్చారు.
సూర్యాపేట టౌన్, జనవరి 13 : తెలంగాణ గొంతు ప్రపంచానికి వినిపించేలా మరణం చివరి అంచుల వరకు పోరాడి.. అప్పటి కేంద్రం మెడలు వంచి పోరాడి సాధించిన తెలంగాణను ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ధి సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే యా వత్ దేశానికి శ్రీ రామరక్ష అని.. అలాంటి దమ్మున్న నాయకుని అభివృద్ధి పాలన కోసం అన్ని రాష్ర్టాల ప్రజలు ఎదురుచూస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్లో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఈ నెల 18న ఖమ్మంలో జరుగనున్న సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్‌ను మార్చగల దమ్ము, ధైర్యం సీఎం కేసీఆర్‌కే మాత్రమే ఉన్నాయన్నారు. ఎనిమిదేండ్లుగా ఏదో ఒక రూపం అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రతి కుటుంబం అందుకుంటుందని.. అవన్నీ యావత్ దేశానికి అందుతాయని అన్ని రాష్ర్టాల ప్రజలు ఆశపడుతున్నారన్నారు. రాష్ట్రంలో 4 కోట్ల మందితో పాటు దేశ ప్రజలంతా బీఆర్ఎస్కే జై కొడుతు న్నారన్నారు. బీజేపీ రాక్షస పాలన నుంచి దేశానికి విముక్తి కావాలంటే కొత్త నాయకత్వం అవసరమని అంతా నమ్ముతున్నారని.. అలా ంటి నాయకత్వానికి సీఎం కేసీఆరే రథసారథిగా ఉండాలని ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు.
2014లో అధికారంలోకి వచ్చాక 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేంద్రం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోగా లక్షలాది మంది ఉద్యోగాలను ఊడదీసి రోడ్డున పడేసిన పాపం బీజేపీ మోదీదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్న కేంద్రం తీరుపై అన్ని రంగాల ప్రజలు విసుగుచెందుతుందన్నారు. మతం పేరుతో రాజకీయం చేస్తూ దేశంలో చిచ్చు పెడుతున్నదని ధ్వజమెత్తారు. బీజేపీ, కాంగ్రెస్ వల్ల దేశం తిరోగమనం పయనిస్తుందన్నారు. దేశానికి వ్యవసాయమే ప్రధాన ఆధారమైన రంగమని అలాంటి రంగాన్ని మోదీ ప్రభుత్వం గాలికొదిలేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ చచ్చిన శవం మాదిరి కనుమరుగవుతుందని.. రాబోయే రోజుల్లో బీజేపీకీ అథోగతి పడుతుందని.. ప్రత్యామ్నా యం లేకపోవడం వల్లనే ప్రజలు ఆ రెండు పార్టీలను ఎన్నుకోక తప్పలేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశానికి పార్టీ బీఆర్ఎస్ వంటి సమర్ధ నాయకత్వం కేసీఆర్ రూపంలో వచ్చిందన్నారు.
బీఆర్ఎస్ అవిర్భావ సభకు మూడు రాష్ర్టాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ఇతర రాష్ర్టాల నుంచి పెద్ద ఎత్తున హాజరుకానున్నారని.. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తొలి సభను విజయవంతం చేయాలన్నారు. విపక్షాల గుండెలదిరేలా సీఎం కేసీఆర్ సభకు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి రావాలని.. అంతా సకాలంలో సభాప్రాంగణానికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి పలువురు బీఆర్ఎస్లో చేరగా వారికి మంత్రి జగదీశ్‌రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చింతల చెర్వుతో పాటు ఆత్మకూర్ (ఎస్) మండలం ఏనుబాముల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు ఇటీవల మృతి చెందారు. వారికి బీఆర్ఎస్ సభ్య త్వం ఉండడంతో బీమా చెక్కులను ఒక్కొక్కరికీ రూ.2 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్య యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, పట్టణాధ్యక్షుడు సవరాల సత్యనారాయణ, వివిధ మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.