నకిరేకల్, అక్టోబర్ 08 : స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు రెడీగా ఉన్నట్లు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. బుధవారం నకిరేకల్‌లో “కాంగ్రెస్ బాకీ కార్డులను” ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీల పేరిట కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందన్నారు. అమలుకానీ హామీలతో, మోసపూరిత మాటలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. అన్నివర్గాల వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. రైతు భరోసా, రుణమాఫీ, పింఛన్ల పెంపు, విద్యార్థినులకు స్కూటీలు, నిరుద్యోగులకు భృతి, ఆటో కార్మికులు, రైతు కూలీలను మోసం చేసిన దుర్మార్గులు కాంగ్రెస్ నాయకులు అని దుయ్యబట్టారు.
22 నెలలు గడిచినా కాంగ్రెస్ ప్రభుత్వానికి చలనం రావడం లేదన్నారు. కాంగ్రెస్ అసమర్థ పాలనతో గ్రామాల్లో ప్రజలు దుమ్మెతి పోస్తున్నారన్నారు. ఎన్నికలు ఏవైనా, ఎప్పుడైనా గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను చీపురులతో ఉరికించే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, మాజీ పి ఎస్ ఎస్ చైర్మన్ మహేందర్ రెడ్డి, కౌన్సిలర్ పల్లె విజయ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నవీన్ రావు, ప్రధాన కార్యదర్శి కేశవరాజు, మాజీ ఎంపిటిసిలు గుర్రం గణేష్, రాచకొండ వెంకన్న, నాయకులు సోమా యాదగిరి, రావిరాల మల్లయ్య, సామ శ్రీనివాస్ రెడ్డి, రాచకొండ శ్రవణ్, పేర్ల కృష్ణకాంత్, చిట్యాల అశోక్ పాల్గొన్నారు.
Nakrekal : కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు రెడీ : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య