PDSU | పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని.. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కనీసం 20 శాతం నిధులు కేటాయించేలా అసెంబ్లీలో విద్యారంగ సమస్యలపై మాట్లాడాలని PDSU నాయకులు మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇవాళ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో PDSU నాయకులు జగదీష్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు.
రాష్ట్రంలో పేద విద్యార్థులకు రావలసిన పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు దాదాపు 8 వేల కోట్లు రూపాయలు ఉన్నాయని.. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా విడుదల చేయలేదన్నారు. దీనివల్ల లక్షలాదిమంది విద్యార్థులు చదువుకు దూరం అయ్యే పరిస్థితి ఉందని.. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థలకు నిధులు లేక అనేక సమస్యలతో నడుస్తున్నాయన్నారు.
కనీసం మౌలిక సదుపాయాలు లేక, టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయడం లేదన్నారు. కనీసం మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజనం, స్వీపర్లు కూడా సరిగా లేని పరిస్థితి దాపురించిందన్నారు. ఇవన్నీ పూర్తి చేయాలంటే విద్యా రంగానికి నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని.. అందుకు రాష్ట్ర బడ్జెట్ను విద్యారంగానికి ప్రభుత్వం ఇచ్చినట్టు 20 శాతం నిధులు కేటాయించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని జగదీష్ రెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో PDSU జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సింహాద్రి, నాయకులు అందడి శ్రీధర్, కిరణ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Srisailam | శ్రీశైలంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన డీఐజీ ప్రవీణ్
బస్సులున్నయ్.. డ్రైవర్లే లేరు !.. డిప్యూటీ సీఎం ఇలాకాలో ఆర్టీసీ డ్రైవర్ల కొరత!