బీఆర్ఎస్ పాలనలో రోగులకు అన్ని రకాల వైద్య సేవలందించిన సూర్యాపేట ప్రభుత్వ దవాఖాన నేడు దీన స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో పాటు వైద్యాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వైద్యులు చుట్టపుచూపుగా వస్తూ విధులు నిర్వహిస్తున్నారు. దీంతో రోగులకు సకాలంలో సరైన వైద్యం అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. మెరుగైన వైద్య సేవలందించినందుకుగాను నాడు అవార్డులు అందుకున్న దవాఖానకు నేడు అరకొర వైద్యం కారణంగా రోగులు రావడానికి జంకుతున్నారు.
– సూర్యాపేట, జూలై 4 (నమస్తే తెలంగాణ)
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వైద్య సేవలు అందించడంలో ఓ వెలుగులు వెలిగిన సూర్యాపేట జనరల్ దవాఖాన నేడు తిరోగమనంలో పయనిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే ఈ దవాఖానలో ప్రసవాల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ఇతర వైద్య సేవలు తగ్గుముఖం పట్టాయి. ఓపీ సేవలు పడిపోతున్నాయి. 2023 మార్చి నుంచి జూన్ నాలుగు నెలల్లో 1,584 ప్రసవాలు జరిగితే… 2025 మార్చి నుంచి జూన్ వరకు నాలుగు నెల లు కలిపి కేవలం 1,111 ప్రసవాలు మాత్రమే అయ్యాయంటే ఈ దవాఖాన ఎలాంటి దయనీ య స్థితికి చేరుకుంటోందో అర్థం చేసుకోవచ్చు.
నాడు ఉచిత చికిత్సలు అందించడంతో అనేక రికార్డులు, అవార్డులు అందుకున్న చోట ప్రభుత్వ నిర్ల క్ష్యం.. వైద్యాధికారుల ఇష్టారాజ్యం.. పర్యవేక్షణ లేకపోవడంతో పేదోళ్లకు వైద్యం దూరమవుతోంది. పేదలకు చికిత్సలు అందడం లేదు. ఏడాదికి పైగా ఇక్కడ పలు రకాల రక్త, మూత్ర పరీక్షలు చేయడం లేదు. ఏదో మార్పు తీసుకొస్తామని అమలుకు నోచుకోలేని హామీలు, మాయమాటలు, మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీల్లో అరకొరగా కూడా అమ లు చేయకపోగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలనూ కొనసాగించలేని దుస్థితిలో ఉంది.
మాజీమంత్రి, ప్రస్తుత సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పట్టుబట్టి కేసీఆర్‌తో మాట్లాడి సూర్యాపేటకు మెడికల్ కళాశాలను తెప్పిస్తే.. నేడు కాంగ్రెస్ సూర్యాపేట జనరల్ దవాఖానకు వెళ్తే అక్కడ దిగజారిపోతున్న వైద్య సేవలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏమైందో ఏమోగానీ ఏడాదిన్నర కాలంలోనే ఈ దవాఖాన ఆగమాగమైపోతోంది. కొవిడ్ సమయంతో పాటు తదనంతరం చికిత్సలు అందించడంలో అనేక అవార్డులు అందుకోగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అవార్డుల సంగతి పక్కన పెడితే సాధారణ వైద్య సేవలు కూడా అందించ డం లేదు.
ఏడాదిన్నరలో అయోమయం
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాదిన్నర కాలంలో పేద, మద్య తరగతి వర్గాలకు అందుబాటులోకి తెచ్చిన ఖరీదైన వైద్యం ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యం తో తిరోగమనంలోకి వెళ్తోంది. సూర్యాపేట జనరల్ దవాఖానను పరిశీలిస్తే నేడు వైద్య సేవలు అందుతున్న వైనం తెలిసిపోతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2023తో పోల్చుకుంటే వైద్య సేవలు భారీగా పడిపోయాయి. డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండకపోవడం, ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ విద్యార్థులే చికిత్సలు అందిస్తున్నారు.
డయాగ్నస్టిక్ హబ్ ఉన్నప్పటికీ అన్ని రకా ల పరీక్షలు చేయకపోవడంతో ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కోల్పో తూ మళ్లీ ప్రైవేట్‌ను ఆశ్రయిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో 2023 మార్చి నుంచి జూన్ నాలుగు నెలల్లో 1,584 ప్రసవాలు జరిగితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది 2024లో అదే నాలుగు నెలల్లో 224 ప్రసవాలు తగ్గి 1,340కి చేరుకున్నాయి. ఈ ఏడాది 2025 మార్చి నుంచి జూన్ వరకు నాలుగు నెలలు కలిపి కేవలం 1,111 ప్రసవాలు మాత్రమే అయ్యాయంటే ఈ దవాఖాన ఎలాంటి దయనీయ స్థితికి చేరుకుంటోందో అర్థం చేసుకోవచ్చు.
2023 వరకు వివిధ వ్యాధుల చికిత్స కోసం ప్రతి నిత్యం జనరల్ దవాఖానకు 180 నుంచి 200 మంది పేషెంట్లు (ఓపీ) నమోదు కాగా 2024లో రోజుకు 120 నుంచి 140 మించి రాలేదు. ఈ ఏడాది 100 నుంచి 120కి మించడం లేదని కొన్ని రోజుల్లో 80 మంది మాత్రమే వస్తున్నారని తెలిసింది. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో గాంధీ, ఉస్మానియా దవాఖాన ల తరువాత సూర్యాపేట జనరల్ దవాఖానకు ఎంతో పేరు వచ్చిం ది. సూర్యాపేట జనరల్ దవాఖానలో అందించిన సర్వీసెస్, సిటీ స్కానింగ్, రికార్డు స్థాయిలో ఓపీలతోపాటు ఆరో గ్య శ్రీ సర్జరీల రికార్డులకు కూడా అవార్డులు వచ్చాయి.
కొవిడ్ సమయంలో సూర్యాపేట జిల్లాతోపాటు జనగాం, వరంగల్, నల్లగొండ జిల్లాలతోపాటు ఏపీ నుంచి కూడా పెద్ద సం ఖ్యలో వచ్చి చికిత్స పొంది వెళ్లిన చరిత్ర ఉంది. నేడు ఈ దవాఖాన మసకబారిపోతోం ది. టెస్టులకు కావాల్సిన మెటీరియల్ తెప్పించుకోకపోవడంతో డయాగ్నస్టిక్ హబ్‌లో టెస్టులు తగ్గిపోయాయి. ఏడాదిగా బ్లడ్‌గ్రూపింగ్ పరీక్షలు చేయకపోగా గర్భిణుల పరీక్షలు కూడా అదే పరిస్థితి. రెండు నెలలుగా మూత్ర పరీక్షలు, 20 రోజులుగా థైరాయిడ్ పరీక్షలు చేయడం లేదు.
డాక్టర్లు చుట్టపుచూపు