దామరచర్ల, జనవరి 17 : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు దామరచర్ల ఎంపీడీఓ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ కార్మికులు శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ మండల కన్వీనర్ ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని గ్రామ పంచాయతీలో సిబ్బందిని వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలిపారు. వారి పెండింగ్ వేతనాలు చెల్లించాలని, డ్రెస్ కోడ్ ఇవ్వాలన్నారు. వారికి కనీస వేతనం, ఆరోగ్య బీమా, ఇతర సదుపాయాలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దామరచర్ల గ్రామ పంచాయతీ వర్కర్స్ సీఐటీయూ అనుబంధం అధ్యక్షుడు శ్రీరాములు, వాడపల్లి ఉపాధ్యక్షుడు అక్కెనపల్లి సైదులు, ప్రధాన కార్యదర్శి ఎండి జైరు పాల్గొన్నారు.