నల్లగొండ, జూలై 11: చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తూ…ఏజెన్సీల వేతన కటింగ్స్‌తో ఇబ్బంది పడుతూ..బతుకీడుస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రెన్యువల్స్ కొనసాగింపు ఇవ్వకపోవడంతోపాటు నాలు గు నెలలుగా వేతనాలు సైతం ఇవ్వకపోవడంతో ప్రభుత్వంపై కన్నెర్ర చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అలా ఉంచి తే.. కనీసం గత ప్రభుత్వాల పద్ధతులు పాటించకపోవడంతో ఆవేదన చెందు తూ శనివారం మహాధర్నాకు పిలుపునిచ్చారు. ఇప్పటివరకు వినతులతోనే విన్నవించిన ఉద్యోగులు, సర్కారుతో సమరానికి సై అంటూ…హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే మహాధర్నాకు ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలివెళ్తేందుకు ఏర్పాట్లు చేశారు.
గత ప్రభుత్వాలు ప్రతి ఏటా ఏప్రిల్‌లో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రెన్యువల్ ప్రాసెస్ చేపడుతుంది. కాంగ్రెస్ సర్కార్ ఈ ఏప్రిల్ నుంచి రెన్యువల్ చేయకపోవడంతోపాటు ఇప్పటివరకు జీతాలు కూ డా ఇవ్వలేదు. పైగా సర్కార్ ఇచ్చే జీతం లో ఏజెన్సీలే 25శాతం పోతుంది. ఏజె న్సీ విధానం రద్దు చేసి ఉద్యోగుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి వేతనాలు ఇ వ్వాలనేదే వారి ప్రధాన డిమాండ్. తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవడంతోపాటు ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. బిస్వాల్ కమిటీ సూచన మేరకు ప్రతి ఏడాది ఇంక్రిమెంట్, మరణించిన లేదా ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు రూ.10లక్షల ఆర్థికసాయం, ఉద్యోగాల్లో వెయిటేజ్ ఇవ్వాలన్నారు.
ప్రభుత్వం ఏప్రిల్ లో ఔట్సోర్సింగ్ ఉ ద్యోగులకు రెన్యువ ల్ చేస్తుంది. ఈ ప్ర భుత్వం ఇప్పటివర కు చేయలేదు. వెంటనే రెన్యువల్ చేసి పెండింగ్ వేతనాలు విడుదల చేయా లి. ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. రెగ్యులర్ ఉద్యోగుల లాగానే మాకు కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలి.
– యానాల శేఖర్ రెడ్డి, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ జిల్లా అధ్యక్షుడు, నల్లగొండ