తురపల్లి,ఏప్రిల్ 30 : ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టి, వెంటనే కేంద్రాల నుంచి తరలించాలని ప్రభుత్వ మాజీవిప్, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి గొంగిడి సునీతామహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని ము లకలపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం ఎదుట భువనగిరి- గజ్వేల్ ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్రా రెడ్డి తదితర రైతులతో కలిసి దాదాపు రెండు గంటల పాటు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. అంతకుముందు ఆమె కొనుగోలు కేంద్రంలోని రైతుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సునీతారెడ్డి మాట్లాడుతూ వారం రోజుల క్రితం ఎమ్మె ల్యే బీర్ల అయిలయ్య ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించి ఫొటోలకు పోజులిచ్చి వెళ్లరని, కానీ నేటికీ కొనుగోళ్లు ప్రారంభం కాలేదనన్నారు. గత 20 రోజులుగా రైతులు కొనుగోలు కేంద్రాల్లోని తమ ధాన్యం వద్దనే పడికాపులు కాస్తున్నా రన్నారు. మహిళా రైతుల సైతం ఇండ్ల వద్ద పిల్లలను వదిలి కేంద్రంలోని ధాన్యపు రాశుల వద్ద రాత్రిళ్లు నిద్రించాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కొనుగోలు కేంద్రం ప్రారంభమై వారం గడుస్తున్నా నేటికీ కేంద్రాల్లో కాంటాలు కానీ, గన్నీ బ్యాగులు గాని లేవని హమాలీలను ఏర్పాటు చేయకుండా, కొనుగోళ్లు ప్రారంభించకుండా ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. వెం టనే కొనుగోళ్లు ప్రారంభించి ధాన్యాన్ని తరలించకపోతే రైతులతో కలిసి ఎమ్మెల్యే ఇంటితోపాటు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే ఐలయ్యకు భూకబ్జాలపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదన్నారు. వరి కోతలు ప్రారంభమై నెల రోజులు కావొస్తున్నా నేటికీ క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతుందో ఆయనకు అవగాహన లేదన్నారు. రోడ్డుపై ధర్నా చేసున్న సునీతా రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్ రెడ్డి, మండల సెక్రటరీ జనరల్ సాగర్ల పరమేశ్, సర్పంచులు సీతరాజు, మోతీరామ్ మాజీ ఎంపీటీసీలు గిద్దె కరుణాకర్, రాజేశ్‌నాయక్, మాజీ సర్పంచ్ లు ఇమ్మడి మల్లప్ప, బాలకృష్ణ, హరి నాయక్, రవీందర్ నాయక్, షాదుల్లా, భాసర్ తదితరులు ఉన్నారు.