NTR Statue | నల్గొండ పట్టణంలో అపశృతి నెలకొంది. ఎన్టీఆర్ చౌరస్తాలోని విగ్రహానికి మంటలు అంటుకోవడంతో కాలిపోయింది. ఈ విషయాన్ని శనివారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు అనంతరం మున్సిపల్ సిబ్బంది ఎన్టీఆర్ విగ్రహాన్ని శుభ్రపరిచే పనులు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
విగ్రహానికి ఎవరైనా కావాలనే నిప్పంటించారా? లేదా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సమీపంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.