Gattuppal | గట్టుప్పల్, సెప్టెంబర్ 21 : అభివృద్ధి విషయంపై బీఆర్ఎస్ మాజీ జెడ్పీటీసీ కర్నాటి వెంకటేశంను విమర్శించే స్థాయి స్థానిక కాంగ్రెస్ నాయకులకు లేదని చండూరు మాజీ వైస్ ఎంపీపీ అవ్వరి శ్రీనివాస్ మండిపడ్డారు. ఆదివారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి జగరలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మండలం ఏర్పడిందని గుర్తు చేశారు.
గట్టుప్పల్ మండల కేంద్రంలో డబుల్ రోడ్డు మంజూరు, ప్రతీ గ్రామంలో ప్రతీ కాలనిలో బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే సీసీ రోడ్లను నిర్మాణం చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు దగ్గర పడుతున్నా మండలంలో ఇప్పటివరకు ప్రభుత్వ సొంత భవనాలు లేవని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో మంజూరైన నిధులతోనే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి గత ప్రభుత్వంలోనే మంజూరు అయిందని, స్థల సేకరణ బీఆర్ఎస్ హయాంలో చేశామన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పున్న కిషోర్, తీరందాసు ఆనంద్, గంజి కృష్ణయ్య, చేరుపల్లి కృష్ణ, దోర్నాల అమరెందర్, కర్నాటి శ్రీను, కర్నాటి వెంకటేశం, జూలూరి పురుషోత్తం, జెల్ల అంజయ్య, అందె రాము, చేరుపల్లి నగేష్, దోర్నాల కుకూడాల స్వామి, వినోద్, దోర్నాల బాలకృష్ణ, గుర్రం యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
Nagarjuna Sagar | నాగార్జున సాగర్‌కు పోటెత్తిన వరద.. 26 గేట్లు ఎత్తివేత
Tandur | ఇరువైపులా తుమ్మ చెట్లు – ప్రమాదాలకు గురువుతున్న వాహనాదారులు