హుజూర్నగర్, జులై 07 : ఈ నెల 9న జరిగే సార్వత్రిక సమ్మెతో మోదీ ప్రభుత్వానికి దిమ్మతిరగాలని సీపీఎం పార్టీ కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. సోమవారం పార్టీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో నిర్వహించిన మోటార్ సైకిల్ ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. 11 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరించటం జరుగుతుందన్నారు. ప్రజలకు అవసరం లేనటువంటి అనేక రకాల విధ్వంసకరమైన ఆలోచనలు, విధానాలు, కార్యక్రమాలు చేపట్టడం అనేది ఇవాళ మోదీ విధానాలుగా మనకు కనిపిస్తున్నట్లు తెలిపారు.
సమ్మెకు కేంద్ర కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు కూడా సంపూర్ణమైన మద్దతు తెలిపాయన్నారు. వ్యాపార వర్గాలు, ఉద్యోగస్తులు, రైతు, కూలీలు, సకల జనులు కదం తొక్కాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు పల్లె వెంకట్రెడ్డి, దుగ్గి బ్రహ్మం, వట్టెపు సైదులు, మండల కార్యదర్శి పోషణబోయిన హుస్సేన్, సెయింట్ యు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శీలం శ్రీను, ఎలుక సోమయ్య గౌడ్, జిఎంపిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు పాశం వెంకటనారాయణ, రేపాకుల మురళి, చిన్నం వీరమల్లు, తురక వీరయ్య, పిట్టల నాగేశ్వరరావు, రేపాకుల వీరస్వామి, పాశం వీరబాబు, పంగా వెంకటి, ముసిని శంభయ్య, కిశోర్ కుమార్, ఉపతల గోవిందు, పంగా కృష్ణ, చింతకాయల శీను, మామిడి వీరబాబు, గుగ్గిల నరసింహారావు, కాలంగి నాగేశ్వరరావు, రాజు, ఉపతల వెంకన్న పాల్గొన్నారు.