నల్లగొండ జిల్లా : నల్లగొండ ప్రభుత్వ అస్పత్రిలో ఈ నెల 4 వ తేదీన కిడ్నాప్‌నకు గురైన బాలుడిని నల్లగొండ టూటౌన్ పోలీసులు సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకుని టూ టౌన్ పోలీసులకు గైడ్ చేస్తూ కేసును చేధించారు.
ఎస్పీ పవార్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో నివాసం ఉండే ఎండీ అహ్మద్-షమీ మున్నీసా దంపతులకు ఇద్దరు పిల్లలు. వారికి కూతురు అలీనా (5), కొడుకు రెహమాన్ (3) ఉన్నారు. ఈ నెల 4వ తేదీన సాయంత్రం 4 గంటలకు ఆస్పత్రి ఆవరణలో ఆడుకుంటుండగా అబ్దుల్ రెహమాన్ అదృశ్యమయ్యాడు. బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల అంతా వెతికారు. ఎంతకీ ఆచూకీ దొరక్కపోవడంతో నల్లగొండ టూ టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. షమీ మున్నీసా ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు 24 గంటల్లోనే కేసును చేధించారు. బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.
బాలుడి ఆచూకీ కోసం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కూడా బాలుడి ఆచూకీ కోసం ఆరు పోలీసు బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. నల్గొండ డీఎస్పీ కె.శివరాం రెడ్డి ఆధ్వర్యంలో నల్లగొండ టూటౌన్ సీఐ రాఘవరావు పర్యవేక్షణలో బాలుడి ఆచూకీని కనుగొన్నారు. నల్లగొండ టూ టౌన్ SI రావుల నాగరాజు తన సిబ్బంది సాగర్ల శంకర్, లావూరి బాలకోటి, జానకి రామ్ తో కలిసి ప్రభుత్వ ఆసుపత్రిలోని సీసీటీవీ కెమెరాలు పరిశీలించి నేరస్థుడిని గుర్తించారు. నార్కట్‌పల్లి మండలం మాండ్ర గ్రామానికి చెందిన రాపోలు సీతారాములు (40)గా గుర్తించారు. నిందితుడి నుంచి బాలుడిని రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు.
నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. తన చిన్నమ్మ కూతురు ముద్దముల అరుణకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారని.. మగ సంతానం లేకపోవడంతో ఈ బాలుడిని కిడ్నాప్ చేసినట్లు వెల్లడించారు. అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.
అతని చిన్నమ్మ కూతురూ ముద్దముల అరుణ కు ముగ్గురు కూతుర్లు వుండి మగ సంతానము లేకపోవడంతో ఆమె కోసం ఈ బాలున్ని కిడ్నప్ చేసినట్టు ఒప్పుకున్నాడు. నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాలలో బాలుడు గత కొద్ది రోజుల నుండి ఆడుకోవడము గమనించి అతన్ని కిడ్నాప్ చేసుకుని పోయి మగ పిల్లలు లేని అతని చెల్లెలు అరుణ కు ఇవ్వడము ఇచ్చాడు. అరుణ నుంచి బాలున్ని స్వాదినం చేసుకుని బాలున్ని తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుణ్ణి రిమాండ్ కు తరలించారు.