హాలియా, జూలై 22 : సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్ర అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకు పోతున్నదని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. అనుముల, పెద్దవూర, త్రిపురారం, గుర్రంపోడు, తిరుమలగిరి సాగర్ మండలాలకు చెందిన 49 మందికి సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ. 20 లక్షల చెక్కులను శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రభుత్వ దవాఖానల్లో అన్ని వసతులు కల్పించి కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించడం వల్ల గతంలో ఎకరం లక్ష కూడ పలుకని భూములు ఇప్పుడు రూ.30 లక్షల విలువ చేస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, నరేందర్, రవినాయక్, తాటి సత్యపాల్, పిడిగం నాగయ్య, బొల్లం రవీందర్, అనుమల సత్యం, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.
హాలియ మున్సిపాలిటీ పరిధిలోని మూడు, నాలుగు వార్డుల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ప్రజల సమస్యలు తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్పర్సన్ వెంపటి పార్వతమ్మాశంకరయ్య, వైస్ చైర్మన్ నల్లగొండ సుధాకర్, మలిగిరెడ్డి లింగారెడ్డి, కౌన్సిలర్లు వర్రా వెంకటరెడ్డి, శ్రీను, ప్రసాద్, వెంకటయ్య, కమిషనర్ వీరారెడ్డి పాల్గొన్నారు.
బీమా చెక్కుల పంపిణీ… ఇటీవల మృతి చెందిన అనుమలు, పెద్దవూర మండలాలకు చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలకు మంజూరైన రూ.2 లక్షల పార్టీ బీమా చెక్కులను శుక్రవారం ఎమ్మెల్యే అందించారు. కార్యక్రమలో పార్టీ మండలాధ్యక్షులు కూరాకుల వెంకటేశ్వర్లు, జటావత్ రవినాయక్, నాయకులు శ్రీను, సత్యం, శంకర్‌నాయక్, సర్పంచులు రామాంజనేయులు, కృష్ణయ్య, నరేశ్ పాల్గొన్నారు.