సంస్థాన్ నారాయణపురం, అక్టోబర్ 20 : రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో జరుగుతున్న అభివృద్ధిని చూసే వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మండలంలోని సర్వేల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ 11వ వార్డు సభ్యుడు ఈసం పరమేశ్, గుజ్జ గ్రామంలో బీజేపీకి చెందిన రాచకొండ రాజు, తోకల భిక్షపతి, నల్లకంటి వేణు ఎమ్మెల్యే సమక్షంలో శుక్రవారం బీఆర్ఎస్లో చేరారు.
వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ వీరమళ్ల భానుమతి, సర్పంచ్ యాదవరెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ శ్రీధర్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కత్తుల లక్షయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు సత్తయ్య, నాయకులు సత్తిరెడ్డి, పగిళ్ల శ్రీకాంత్, సైదులు పాల్గొన్నారు.