సంస్థాన్ నారాయణపురం,నవంబర్ 25 : గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి ఆ తండాలను అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మండలంలోని రాచకొండ, కడిలబావితండా, వెంకాంబావితండా, గంగముల తండా, వాచ్యతండా, పోర్లగడ్డతండా ,కడపగండి తండా, చిమిర్యాల, గుడిమల్కాపురం,శేరిగూడెం గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకురాలు పాల్వాయి స్రవంతితో కలిసి శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కేవలం 250 మంది ఓటర్లు ఉన్న వాచ్యతండాను పంచాయతీ ఏర్పాటు చేసి వారికే అభివృద్ధి చేసుకునే విధంగా అవకాశం కల్పించిన ఘనత బీఆర్ఎస్కే దక్కింది అన్నారు.
మండల వ్యాప్తంగా 13 తండాలను నూతన గ్రామ పంచాయితీలుగా మార్చి రూ.20లక్షలతో గ్రామ పంచాయితీ భవానలు,గిరిజన గురుకుల పాఠశాల ఏర్పాటు చేశామని తెలిపారు.మండలంలోని గిరిజన తండాల్లో రూ.11 కోట్లతో బీటీ రోడ్లు నిర్మించామన్నారు. నారాయణపురంలో రూ.2కోట్లతో సంత్ సేవాలాల్ భవనం నిర్మిస్తామని అన్నారు. 2014 నుంచి 2108 వరకు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాత్రమే మునుగోడు నియోజకవర్గం జరిగిందన్నారు. జరగబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ పాల్వాయి స్రవంతి మాట్లాడుతూ రాష్ట్రంలో మళ్లి రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని సీఎం కేసీఆర్ నాయకత్వంలో హ్యాట్రిక్ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ వీరమళ్ల భానుమతీ గౌడ్, వైస్ ఎంపీపీ రాజు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కత్తుల లక్ష్మయ్య, ఎంపీటీసీలు శివరాత్రి కవితాసాగర్, దోనూరి స్రవంతి, నరేశ్, కరంటోతు విజయ, సర్పంచులు దోనూరి జైపాల్ రెడ్డి, ఒగ్గు గణేశ్,పాండురంగా నాయక్, దేవిలాల్, శ్రీను, సరుపల్లి శైలజ, నాయకులు మన్నె ఇంద్రసేన రెడ్డి, గడ్డం మురళిధర్ రెడ్డి పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రచారానికి అడుగడుగునా జనం నీరాజనం పలికారు. మహిళలు మంగళహారతులు పట్టి తిలకం దిద్దారు. కోలాట బృందాలు తమ ఆట పాటలతో అలరించారు.పాల్వాయి స్రవంతి గిరిజన మహిళలతో కలిసి సంప్రదాయ నృత్యం చేశారు..
చౌటుప్పల్‌రూరల్, నవంబర్ 25 :మండలంలోని వివిధ పార్టీల నుంచి యువకులు బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. చౌటుప్పల్ 13వ వార్డుకు చెందిన తోర్పునూరి బాబు గౌడ్, చెరుకు అశోక్‌గౌడ్, శ్రీనుగౌడ్, వెంకటేశ్, అచ్చయ్య, రాము, బోల్లోజు విశ్వరూపాచారి, బోదుల లింగస్వామి, ఎర్రసాని శ్రీను, ఉష్కాగుల వెంకటేశ్, బెదర్కోట వెంకటేశ్, మార్గం రాజు, తోర్పునూరి మల్లేశ్,చంద్రయ్య గౌడ్, కల్లెం నాగరాజు, చొల్లేటి మల్లేశ్ చారి, చౌహన్ శ్రీను, ఎస్కే షరీఫ్,ఎండీ కతర్,కే రాము,చెరుకు శివాజీ తదితరులు బీఆర్ఎస్లో చేరిన వారిలో ఉన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ముత్యాల ప్రభాకర్‌రెడ్డి, తోర్పునూరి నర్సింహగౌడ్, దేవరపల్లి గోవర్ధన్‌రెడ్డి, పాశం సంజయ్‌బాబు, గణమోని మల్లేశ్, చెవగోని వెంకటేశ్, చెవగోని మహేశ్ మొగుదాల అంజయ్య తోర్పునూరి సాయి ఉన్నారు.
మునుగోడు : మండల కేంద్రానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు,యువకులు శనివారం బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీపీ కర్నాటి స్వామియాదవ్,బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బండ పురుషోత్తంరెడ్డి, గ్రామ పంచాయతీ కో-ఆప్షన్ మెంబర్ పాలకూరి నర్సింహగౌడ్, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, వట్టికోటి నర్సింహ, ఐతగోని విజయ్‌కుమార్ పాల్గొన్నారు.