నిడమనూరు, జూన్ 28 : నిడమనూరు మండలంలోని సూరేపల్లి గ్రామానికి చెందిన సంకూరి వెంకట నారాయణ మున్నూరు కాపు యువత నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజీవ్ శుక్రవారం నియామక ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా వెంకటనారాయణ శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. మున్నూరు కాపులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. హాస్టల్స్ నిర్మాణం, బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం పోరాడతానన్నారు. తన నియామకానికి కృషి చేసిన జిల్లా, రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.