– చండూరు ఎస్ఐ వెంకన్న గౌడ్
చండూరు, జనవరి 06 : మోటార్ సైకిల్ నడిపేటప్పుడు ప్రతి ఒక్కరు హెల్మెట్ తప్పక ధరించాలని చండూరు ఎస్ఐ వెంకన్న గౌడ్ అన్నారు. జాతీయ భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం చండూరు పట్టణం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఐ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతను తెలియజేశారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అవసరమైన జాగ్రత్తలను వివరించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ అర్థం, రోడ్డు దాటే సమయంలో పాటించాల్సిన నియమాలు, హెల్మెట్, సీట్ బెల్ట్ ప్రాముఖ్యం, అధిక వేగం వల్ల కలిగే అనర్థాలు, మొబైల్ ఫోన్ డ్రైవింగ్ వచ్చే ఏర్పడే నష్టాలను వెల్లడించారు. అలాగే పిల్లలు రోడ్డు మీద నడిచేటప్పుడు, సైకిల్ తొక్కేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Chandur : ‘వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు తప్పక పాటించాలి’