మునుగోడు, సెప్టెంబర్ 29 : మునుగోడు మండల వ్యాప్తంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం అమ్మవారు సరస్వతి దేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆయా మండపాల్లో అర్చకులు ప్రత్యేకమైన పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పలు గ్రామాల్లోని సరస్వతి పూజలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.